Ads
- చిత్రం : హై వే
- నటీనటులు : ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ, మానస రాధాకృష్ణన్, సయామి ఖేర్.
- నిర్మాత : వెంకట్ తలారి
- దర్శకత్వం : కేవీ గుహన్
- సంగీతం : సైమన్ కె కింగ్
- విడుదల తేదీ : ఆగస్ట్ 19, 2022 (ఆహా)
Video Advertisement
స్టోరీ :
డి అలియాస్ దాస్ (అభిషేక్ బెనర్జీ) హైదరాబాద్ నగరంలో మహిళలపై 5 వరుస హత్యలకు పాల్పడిన సైకోపాత్ కిల్లర్. ఈ వరుస హత్యల వెనుక హంతకుడు అసలు ఉద్దేశం అర్థం కాకపోవడం పోలీసులకు ఈ case పెద్ద మిస్టరీ గా మారుతుంది.ఈ హత్యలకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ ను ఆశా భరత్ (సయామి ఖేర్) చేపడుతాడు. మరో వైపు, వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్ అయిన విష్ణు (ఆనంద్ దేవరకొండ) తన పని మీద బెంగుళూరుకు బయలుదేరాడు.
తులసి (మానస రాధాకృష్ణన్) ఒక పౌల్ట్రీ ఫామ్‌లో తన ఒంటరి తల్లితో కలిసి పనిచేస్తూ జీవిస్తుంది. తన యజమాని వేదింపులు తట్టుకోలేక పారిపోయిన తులసి యాదృచ్ఛికంగా విష్ణుని కలుస్తుంది. మరోపక్క పోలీసు డిపార్ట్‌మెంట్ సోదాలు ముమ్మరం చేయడంతో దాస్ కూడా నగరం విడిచిపెట్టాడు.సైకోపాత్‌ని పోలీసులు పట్టుకున్నారా? విష్ణు, తులసి కి ఆ సైకోపాత్‌ని ఎదురు పడుతాడా? విష్ణు మరియు తులసి దాస్ ను ఎలా అడ్డగించారు? సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా చూడండి.
రివ్యూ :
ఆనంద్ దేవరకొండ తన సరికొత్త మూవీ హైవే కోసం సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన కెవి గుహన్‌తో జతకట్టారు. ఈ మూవీ నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో విడుదలైంది. మొత్తం మీద ఈ హైవే చిత్రం ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. సినిమా సాగినంతసేపు సస్పెన్స్ తో కూడిన ఎక్సైట్మెంట్ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఈ చిత్రంలోని అన్ని క్యారెక్టర్స్ తమ పాత్రను మంచిగా పోషించారు.
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది నెగిటివ్ పాత్ర పోషించిన అభిషేక్ బెనర్జీ గురించి. అభిషేక్ బెనర్జీ బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించారు. ఆయన నటించిన పాత్రలకి చాలా పేరు వచ్చింది. ఇప్పుడు తెలుగులోకి సినిమాలో ఆయన చేసిన పాత్ర కూడా అంతే గుర్తింపు తీసుకు వచ్చేలాగా ఉంది. హీరో ఆనంద్ దేవరకొండ కూడా సినిమాకి సినిమాకి పోలిక లేకుండా ఉండేలా చూసుకుంటున్నారు. ఆనంద్ దేవరకొండ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ పాత్ర కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సినిమా ఎడిటింగ్ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. కొన్ని సీన్స్ మధ్యలోనే ఆగిపోయినట్టు, కొన్నిచోట్ల ఇరికించినట్టు అనిపిస్తాయి.
ప్లస్ పాయింట్స్ :
- స్టోరీ
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్:
- సినిమా ప్రారంభంలో పాట
- అతికించినట్లు,గా ఆర్టిఫిషియల్ గా ఉన్న కొన్ని సీన్స్
- మిస్సయిన లాజిక్
- పూర్ ఎడిటింగ్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
ఆనంద్ దేవరకొండ ఈ చిత్రంలో ఒక విభిన్నమైన పాత్రలో తన నటన ప్రతిభను ప్రదర్శించారు. మంచి థ్రిల్లింగ్ సీక్వెన్స్ తో, ఆకట్టుకునే కథతో ఈ చిత్రం ఒక ఫుల్ టైం ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు. సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వారిని ఈ సినిమా అస్సలు నిరాశ పరచదు. ఒకటి, రెండు మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ హైవే సినిమా ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.
End of Article