Ads
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన ‘బేబీ’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ లు సృష్టిస్తోంది. ఈ చిత్రానికి డైరెక్టర్ సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో విరాజ్ అశ్విన్ సెకండ్ హీరోగా నటించాడు. ఈ చిత్రాన్ని ఎస్కేఎన్ నిర్మించారు.
Video Advertisement
రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ ఇప్పటికీ విజయవంతంగా ధియేటర్లలో ప్రదర్శితమవుతోంది. రెండు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీకి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ల రెమ్యునరేషన్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంత తక్కువ ఇచ్చారా అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ట్రై యాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. యూట్యూబ్ స్టార్‌గా పాపులర్ అయిన వైష్ణవి ఈ మూవీలో తన నటనలోని మరో కోణాన్ని తెరపై ఆవిష్కరించింది. వైష్ణవి నటనకు యువత ఎంతగా కనెక్ట్ అయ్యారంటే, మూవీ చూసిన వారు ఆమె క్యారెక్టర్ ని దారుణంగా తిడుతున్నారు. అద్భుతమైన నటనతో ఆనంద్ దేవరకొండ ఆడియెన్స్ కి కన్నీళ్లు తెప్పించాడు. వీరిద్దరికీ కొంచెం కూడా తగ్గకుండా విరాజ్ అశ్విన్ తన నటనతో మెప్పించాడు. దాంతో 2 రోజులకే బ్రేక్ ఈవెన్ అయ్యి, ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి రూ.23.07 కోట్లు షేర్ ను సాధించింది. బ్రేక్ ఈవెన్ అవడమే కాకుండా ఈ మూవీ రూ.16.87 కోట్ల లాభాలను రాబట్టి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా అయ్యింది. ఇంతగా ఆకట్టుకున్న వీరికి ఇచ్చిన పారితోషికం గురించి తెలిసి, ఇంత తక్కువా? అని నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. దాదాపు పది కోట్ల బడ్జెట్‌తో బేబీ మూవీని తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండకు దాదాపు రూ.80 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. హీరోయిన వైష్ణవికి రూ.30 లక్షలు మాత్రమే రెమ్యునరేషన్‌గా ఇచ్చారని, ఇక విరాజ్ అశ్విన్‌కు కేవలం రూ.20 లక్షలు ఇచ్చారని నెట్టింట్లో ప్రచారం జరుగుతుంది. అయితే డైరెక్టర్ సాయి రాజేష్ కోటికి పైగా తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
Also Read: ప్రభాస్ ప్రతి మూమెంట్ పై ఎందుకు అంత నెగిటివిటీ…ఇది యాదృచ్ఛకమా లేక ఎవరన్నా కావాలని చేయిస్తున్నారా?
End of Article