అది నేనెప్పుడూ చెప్పలేదు.. కచ్చితం గా లీగల్ యాక్షన్ తీసుకుంటా..” అంటూ సీరియస్ అయిన ఆనంద్ మహీంద్రా.. అసలేమైందంటే..?

అది నేనెప్పుడూ చెప్పలేదు.. కచ్చితం గా లీగల్ యాక్షన్ తీసుకుంటా..” అంటూ సీరియస్ అయిన ఆనంద్ మహీంద్రా.. అసలేమైందంటే..?

by Anudeep

Ads

సోషల్ మీడియా లో పొద్దున్న లేస్తే వేలకొద్దీ పోస్ట్ లను చూస్తూనే ఉంటాం. కొన్ని పోస్ట్ లు అయితే.. ప్రముఖులు చెప్పారు అంటూ చెప్తూ పోస్ట్ చేస్తుంటారు. ఇందులో ఎన్ని నిజాలు ఉంటాయో.. ఎన్ని అబద్ధాలు ఉంటాయో ఎవరికీ తెలియదు. ఈ పోస్ట్ లు తెగ వైరల్ అయిపోతూ ఉంటాయి.

Video Advertisement

కొన్నిసార్లు ఈ పోస్ట్ లు చూసుకున్న ప్రముఖులు స్పందిస్తూ ఉంటారు. కొందరు సైలెంట్ గా ఉండిపోతుంటారు. తాజాగా.. ఈ విషయమై ఆనంద్ మహీంద్రా స్పందించారు.

anand 1

తాను చెప్పని మాటలను.. తాను చెప్పినట్లుగా ఫోటోలు క్రియేట్ చేసి పోస్ట్ చేస్తున్నారని, అవి నేనెప్పుడూ చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ మాధ్యమంలో ఆనంద్ మహీంద్రా ఒక పోస్ట్ ను వేశారు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు అన్న సంగతి తెలిసిందే.

anand 2

పారిశ్రామికవేత్త తన తాజా ట్విట్టర్ పోస్ట్‌లో తనకు తప్పుగా ఆపాదించబడిన కోట్‌ను ఎత్తి చూపారు. తనకు తప్పుడు ఆపాదించబడిన కోట్‌ని చూపిస్తూ..ఆయన మీమ్స్‌ను పోస్ట్ చేసారు. ఇలా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ పోస్ట్ లను ఓ కొలీగ్ తన దృష్టికి తీసుకువచ్చారని.. నేనెప్పుడూ చెప్పని విషయాలను.. నేను చెప్పినట్లుగా పోస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇకపై ఇలాంటివి చూస్తే.. తప్పకుండ లీగల్ యాక్షన్ తీసుకుంటానని అన్నారు.


End of Article

You may also like