లీటర్ పెట్రోల్‌కు 50KM మైలేజ్ ఇచ్చే జీప్…కానీ ఆనంద్ మహింద్ర గారికి ఎందుకు ఇవ్వలేను అన్నారంటే.?

లీటర్ పెట్రోల్‌కు 50KM మైలేజ్ ఇచ్చే జీప్…కానీ ఆనంద్ మహింద్ర గారికి ఎందుకు ఇవ్వలేను అన్నారంటే.?

by Megha Varna

Ads

బీబీసీ తెలుగు కథనం ప్రకారం సోషల్ మీడియాలో బైక్ లాగ కిక్ కొట్టి స్టార్ట్ చేసే జీప్ ఒకటిఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టికి కూడా వెళ్ళింది. అయితే ఈ జీపుని వాళ్లకి ఇస్తే తయారు చేసిన దత్తాత్రేయకు ఎక్స్చేంజ్ కింద మహేంద్ర బొలెరో వాహనాన్ని ఇస్తామని చెప్పారు. అది విన్నప్పటి నుంచీ ఈ జీపుని చూడడానికి చాలా మంది ఆ గ్రామానికి వెళ్తున్నారు.

Video Advertisement

ఈ వాహనాన్ని తయారు చేసారు కానీ ఎలాంటి నియమాలను కూడా పాటించలేదని మహేంద్ర కంపెనీ చెప్పింది. అలానే పట్టుదలతో, సృజనాత్మకతతో ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తాము అని చెప్పింది. పైగా ఇది మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ జీప్ ని పోలి ఉంది అని మహేంద్ర కంపెనీ తెలిపింది.

 

మరుసటి రోజు ఉదయాన్నే నిబంధనలకు లోబడి లేనందున స్థానిక అధికారులు ఈ జీప్ ని ఉపయోగించకుండా అడ్డుకుంటారు. అందుకనే ఇది మాకు ఇస్తే ఎక్స్ చేంజ్ కింద బొలెరో వాహనాన్ని ఇస్తామని చెప్పింది. అలానే దీని నుంచి స్ఫూర్తి పొందడానికి మహేంద్రా రీసెర్చ్ ల్యాబ్ లో భద్రంగా ఉంచుతామని కూడా ట్వీట్ చేసింది. అయితే దత్తాత్రేయ ఈ వాహనం వారికి ఇవ్వాలని లేదు.

అడిగినందుకు సంతోషంగా ఉంది కానీ ఎక్స్చేంజ్ కింద ఇచ్చే వాహనాన్ని ఉపయోగించే పరిస్థితిలో నేను లేను అని.. పన్నులు చెల్లించే స్థోమత నాకు లేదు అంటూ చెప్పారు అలాగే తన భార్య కూడా ఆ వాహనంని ఇంటి మహాలక్ష్మిగా భావిస్తారని అన్నారు. ఆ జీప్ వచ్చిన తర్వాతే జీవితాల్లో మంచి జరుగుతోంది అన్నారు.

కావాలంటే వాళ్లకోసం మరొకటి తయారు చేస్తామని ఆయన చెప్పారు. ఈ జీప్ ని ఏ మాత్రం ఎక్స్చేంజ్ చేయను అని చెప్పారు. ఈ వాహనంలో బైక్‌ ఇంజిన్‌తో పాటు ఆటోరిక్షా టైర్లు, జీపు బానెట్‌ను ఉపయోగించినట్లు చెప్పారాయన. అలానే జీపు రోడ్డు మీదుగా వెళ్తుంటే లోపల కూర్చున్నవారు కూడా కనిపిస్తుంటారని చెప్పారు.

ఈ జీప్ ని ఎలా తయారు చేసారు..?

సంపాదన లో కొంత పొదుపు చేసి ఈ జీపును తయారు చేసారు. దీనికి మొత్తం 50 నుంచి 60 వేల వరకు ఖర్చు అయిందని అన్నారు. ఆయన వుండే గ్రామంలోనే ఆయనకీ ఒక చిన్న వర్క్‌షాప్ ఉంది. కలుపు తీయడం, సానబెట్టడం లాంటి పనులతో పాటు వెల్డింగ్ వర్క్ కూడా ఆయన చేస్తారట. ఇలా ఈ క్రమంలో వాళ్ళ కూతుర్ల కోరిక మేరకు ఆయన ఈ జీప్ ని తయారు చేసారు.

జుగాడ్ జీఫ్ ఫీచర్లు :

ఈ వాహనం స్టీరింగ్‌ను వాళ్ళ యొక్క ఫ్యాబ్రికేషన్ వర్క్‌షాప్‌లోనే చేసారు. ఈయన స్టీరింగ్ ని ఎడమ వైపుకు పెట్టడం మరో ఆశ్చర్యం. దత్తాత్రేయ ఎడమ చేయి బలహీనంగా ఉండటంతో సులువుగా నడిపేందుకు వీలుగా ఉండాలని ఇలా పెట్టారట. అలానే ఈ జీప్ కాస్త చిన్నగా ఉంటుంది. చూడడానికి ఓ ఆర్డినరీ రిక్షాలా ఉంటుంది. దీనిలో ఒకేసారి ఐదుగురు కూర్చోవచ్చు. ఈ వాహనంలో పెట్రోల్ కోసం 5 లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేశారు. ఈ వాహనం లీటర్ పెట్రోల్‌కు 40 నుంచి 50 కి.మీ వరకు మైలేజ్ ఇస్తోంది. గంటకు 40 కి.మీ వేగంతో ఈ జీపు వెళ్తుంది.
గత మూడు నెలలుగా ఇంటి పనులు, కుటుంబం కోసం జీపును వాడుతున్నారట. కానీ ఈ జీపులో ప్రయాణించేందుకు అవసరమైన అనుమతులు ఇంకా రాలేదు.

 


End of Article

You may also like