సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఎన్నో కొత్త విషయాలను పంచుకుంటారు ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలుసుకుంటే వెంటనే సాయం చేస్తారు.
అంతేకాదు దాగున్న క్రియేటివిటీని అందరికీ పరిచయం చేయడంలోనూ ఆనంద మహేంద్రా తర్వాతే ఎవరైనా! తాజాగా ఆయన షేర్ చేసిన క్రియేటివ్ వీడియో వైరల్ అవుతుంది.
ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. ప్రస్తుతం భారతదేశంలో ఆయా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ ఎత్తున వరదలు ముంచెత్తుతున్నాయి. నీటమునిగిన ప్రాంతాల్లో నివసించే వారి జీవితాలు దుర్భరంగా మారుతున్నాయి. జలమయమైన రోడ్లలో బురద, పాములు, ఇంకా రకరకాల విష కీటకాలు ఎన్నో ఉంటాయి. దీంతో వరద నీటిలో కాళ్లు పెట్టాలంటేనే భయమేస్తుంది.
అయితే దీనికి ఓ యువకుడు అద్భుతమైన పరిష్కారం కనిపెట్టాడు. రెండు ప్లాస్టిక్ స్టూల్స్, రెండు తాళ్లతో నీటిలో కాళ్లు పెట్టకుండా సులభంగా ముందుకెళ్లే ట్రిక్ కనిపెట్టాడు. అతడు ఒక స్టూల్‌ని తాడుతో ముందుకేసి దానిపై నుంచుని మళ్లీ మరొక స్టూల్‌ని మరో తాడుతో ఇంకాస్త ముందుకు పెట్టి దానిపై కాలు పెడుతున్నాడు. నదులను తలపిస్తున్న నీటిలో చుక్క నీరు కూడా కాళ్లకు అంటకుండా నడుస్తున్నాడు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకోగా అది ఆనంద్ మహీంద్రా దృష్టికి వచ్చింది. దాంతో అతను తన ట్విట్టర్ ఖాతాలో “అన్ని ఆవిష్కరణలకు అవసరాలే ప్రధాన మూలం” అని క్యాప్షన్‌తో షేర్ చేశారు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. కింద ఆయన షేర్ చేసిన వీడియో కింద ఉంది.
👍🏽 As the saying goes: Necessity is the mother of invention… pic.twitter.com/VjyD2LzgAR
— anand mahindra (@anandmahindra) July 8, 2022