Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కి సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం అత్తారింటికి దారేది. ఈ చిత్రంలో అవకాశం వచ్చినా కూడా కొన్ని కారణాల వల్ల దాన్ని వదిలేసుకున్నట్లు ఒక నటి చెప్పింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వదులుకున్న నటి ఎవరు అని అనుకుంటున్నారా? ఎవరో కాదు మన రంగమ్మ అత్త అనసూయ.
Video Advertisement
అవును అనసూయ కి అత్తారింటికి దారేది సినిమాలో ఒక పార్టీ సాంగ్ లో యాక్ట్ చేసే అవకాశం వచ్చిందట. కాకపోతే ఆ సాంగులో చాలామంది హీరోయిన్ లు ఉన్నారని, ఆ గుంపులో తాను ఒకరిగా నటించడం ఇష్టం లేక అవకాశాన్ని వదులుకున్నట్లు చెప్పారు. తనకంటూ ప్రత్యేకత కోరుకుంటున్నాను కాబట్టే ఆ పాటలో నటించేందుకు నో చెప్పానని అన్నారు.
ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయ చాలా విషయాలు పంచుకున్నారు. అందులో భాగంగానే అత్తారింటికి దారేది సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఆ చాన్స్ వదులుకోవడం వల్ల చాలామంది తనను విమర్శించారని, అందుకని త్రివిక్రమ్ కి సారీ చెప్పానని వివరించారు.తాను చాలా ముక్కుసూటి మనిషినని షూటింగ్స్ లో తన పని ఏదో తాను చూసుకుంటూ వెళ్తానని చెప్పారు. సినిమా అయ్యాక జరిగే పార్టీలకు దూరంగా ఉండబట్టే హీరోయిన్ గా అవకాశాలు చేజారాయి అని తెలిపారు. పార్టీలకు వెళ్తేనే అవకాశాలు వస్తాయనుకుంటే అటువంటి వాటిని తాను ప్రోత్సహించని తేల్చి చెప్పారు.
ఇప్పుడు తనలో మార్పు వచ్చిందని ఎలాంటి పాత్రలోనైనా గుర్తింపు తెచ్చుకోగలనని నమ్మకం కలిగిందని అనసూయ చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారి ఇళ్లల్లోని మహిళలను తలుచుకుంటే జాలి వేస్తుందని అన్నారు. ఈ విషయంలో తన భర్త తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని. ఎవరెన్ని విమర్శలు చేసిన తన నుంచి స్ఫూర్తి పొందే వాళ్ళు చాలామంది ఉన్నారు అని అనసూయ చెప్పుకొచ్చారు.కెరీర్ స్టార్టింగ్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా, టీవీ రిపోర్టర్ గా పనిచేసిన అనసూయ తర్వాత జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు మంచి బిజీ ఆర్టిస్ట్ అయ్యి స్టార్ హీరోలు సరసన నటిస్తూ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంది అనసూయ.
Also Read:నెక్స్ట్ అల్లు అర్జున్ ఇతనే… ఒక్క పాటతో తెలుగులో ఫేమస్ అయిపోయాడు..! అసలు ఎవరు ఇతను..?
End of Article