మీరు మారరు..మీ వల్లే ఇదంతా ! ఒక రేంజ్ లో ఫైర్ ఇంతకీ వాళ్ళు ఎవరు అంటే?

మీరు మారరు..మీ వల్లే ఇదంతా ! ఒక రేంజ్ లో ఫైర్ ఇంతకీ వాళ్ళు ఎవరు అంటే?

by Anudeep

Ads

అటు వెండి తెర,ఇటు బుల్లి తెర అంటూ తేడా లేకుండా సక్సెసఫుల్ గా దూసుకుపోతున్న యాంకర్ అనసూయ..ప్రస్తుతం కరోనా వైరస్ లాక్ డౌన్ రూల్స్ ని కఠినంగా పాటిస్తూ ఇంట్లోనే ఉంటున్నారు..అభిమానుల కోసం తరచూ పేస్ బుక్, ఇంస్ట్గ్రామ్ లో లైవ్ లోకి వస్తూ ఫాన్స్ తో టచ్ లో ఉంటున్నారు..ఇటీవలే ఒక లైవ్ షో లో అభిమానులు అడిగిన ప్రశ్నలకి తండిన శైలిలో జవాబులు ఇచ్చారు..నేను లాక్ డౌన్ పాటిస్తూ ఇంట్లోనే నా కుటుంబం తో సమయం గడుపుతున్నాను అంటూ చెప్పారు..

Video Advertisement

image credits : Anchor anasuya facebook page

కొందరు పిచ్చి పిచ్చి పనుల వళ్ల్లే..లాక్ డౌన్ ని మరింత కఠినంగా మారుస్తున్నారు అంటూ అన్నారు.కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పినట్టు వింటే లాక్ డౌన్ ఇలా కఠినంగా కొనసాగేది కాదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.చిన్న పిల్లల స్కూల్ ఏమయిపోతుందనే టెన్షన్ తనకు ఉంది అని అన్నారు దయచేసి అందరూ తమ తమ ఇళ్లల్లో ఉంటూ లాక్ డౌన్ ని సక్సెసఫుల్ అయ్యేలా చూడాలి.మీరే కాదు మీ చుట్టూ పక్క ఉన్న వాళ్ళకి సైతం లాక్ డౌన్ స్ట్రిక్ట్ గా కొనసాగించమని చెప్పండి అని చెప్పారు.

Image Credits : Anchor Anasuya Facebook Page

ఈ లాక్ డౌన్ పీరియడ్ లో కేవలం ఒక్కసారి మాత్రమే బయటకు వెళ్లినట్టు తెలిపారు ‘మా ఇంటి దగ్గర్లోని సూపర్ మార్కెట్కు నేను, నాభర్తతో కలిసి వెళ్లాను. బయట చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. సూపర్ బజార్‌లో కూడా చాలా స్ట్రిక్ట్‌గా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. అంతకంటే నేను బయటకు వెళ్లిన దాఖలాలు లేవు. ఇంట్లోనే ఉంటున్నాం అని అనసూయ చెప్పారు.లాక్ డౌన్ అనంతరం మొదుట సలోన్ కి వెళ్తాను అంటుంది ప్రస్తుతం తాను చేయాల్సిన సినిమాలు మూడు ఉన్నాయి అని వాటి మీద ద్రుష్టి సారించాలి అని చెప్పారు.షూటింగ్స్ కోసం ఎలాంటి హోమ్ వర్క్స్ చెయ్యను అని, తెలిపారు అటు కన్నడ నాట కూడా ఆఫర్స్ వచ్చాయి అని కానీ అవి ఏవి కూడా చేయట్లేదు అని తెలిపారు.


End of Article

You may also like