తెలుగు బుల్లి తెర పై తనకంటూ మాస్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హాట్ బ్యూటీ యాంకర్ అనసూయ ..అటు సినిమాలు ఇటు టీవీ షోలతో బిజీ బిజీ గా గడుపుతున్న ఈ భామ.తాను ఏ స్టేట్మెంట్ ఇచ్చిన ఒక సంచలనంగా మారుతుంది..ఎక్కువ శాతం టీవీ షోలతోనే పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్. ఆమె చేసిన సినిమాలు తక్కువే క్షణం,రంగస్థలం తో ఆమె చేసిన పాత్రలు బాగా పాపులర్ అయ్యాయి.ఇక ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రాగమార్తాండ’ లో నటిస్తుంది.అందులో ఎసై రోల్ చేయబోతుంది.

Video Advertisement

లాక్ డౌన్ వేళ షూటింగ్ లకి బ్రేక్ పడటం తో ఉన్న కాస్త సమయాన్ని సెలబ్రిటీస్ తమ ఫ్యామిలీస్ తో సమయం గడుపుతున్నారు.మరి కొందరు అయితే తమ హెల్త్ మీద ద్రుష్టి పెడితే మరికొందరు సెలబ్రిటీ ఛాలెంజ్ చేసుకుంటున్నారు.ఇక పోతే మిగిలిన సమయాన్ని ఫాన్స్ కోసం కేటాయిస్తూ ఉంటారు..వాళ్ళతో లైవ్ లో చాట్ చేస్తూ వాళ్ళని ఖుషి చేస్తున్నారు

ఇటీవలే లైవ్ లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి ‘మీ ఫెవరెట్ హీరో ఎవరు’ అన్న ప్రశ్నకి జవాబుగా ఆసక్తికర సమాధానమిచ్చింది. అప్పట్లో అనసూయకు యాక్షన్ కింగ్ అర్జున్ అంటే క్రష్ ఉండేదట.సంచలన సినిమాల దర్శకుడు ‘శంకర్’ దర్శకత్వంలో వచ్చిన ‘జెంటిల్మెన్’ సినిమాకి వీరాభిమాని గా మారిపోయిందట.అప్పట్లో ఒక సంచలనంగా మారింది ఈ చిత్రం ఇదే సినిమాను హిందీలో చిరు రీమేక్ చెయ్యగా సినిమా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది