Home Filmy Adda యాంకర్ శ్యామల, బౌలర్ భువనేశ్వర్ కుమార్ అక్క తమ్ముల్లా.? శ్యామల క్రేజీ కౌంటర్.!

యాంకర్ శ్యామల, బౌలర్ భువనేశ్వర్ కుమార్ అక్క తమ్ముల్లా.? శ్యామల క్రేజీ కౌంటర్.!

by Anudeep

యాంకర్ శ్యామల.. మనందరికీ సుపరిచితమే. టివి లో వచ్చే షో లతో పాటు ఈమె పలు సినిమా ఈవెంట్ లకు యాంకరింగ్ చేస్తారు. తెలుగు లోగిళ్ళలో దాదాపుగా అందరికి శ్యామల సుపరిచితమే. తన చలాకి తనం, స్పాంటేనియస్ జోక్స్, టాకటివ్ నేచర్ తో యాంకర్ శ్యామల అందరికి దగ్గరయ్యారు. కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ.. శ్యామల తిరిగి బుల్లితెరపై సందడి చేస్తున్నారు.

anchor shyamala 2

ఇటీవల, తన భర్త చీటింగ్ కేసు విషయమై తరచూ వార్తల్లో నిలిచారు. ఓ మహిళ వద్ద శ్యామల భర్త నర్సింహా రెడ్డి 2017 వ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా కోటి రూపాయలు అప్పుగా తీసుకున్నారని, తిరిగి చెల్లించకుండా బెదిరిస్తున్నారని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విషయమై నర్సింహా రెడ్డి జైలు కు కూడా వెళ్ళవలసి వచ్చింది. ఇటీవల బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన నర్సింహా రెడ్డి ఓ వీడియో ను కూడా విడుదల చేసారు.

anchor shyamala

తనను తప్పుడు కేసు లో ఇరికించారని.. త్వరలోనే నిజానిజాలు బయటకొస్తాయని ఆయన చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా.. తాజాగా యాంకర్ శ్యామలకు సంబంధించిన మరో విషయం వైరల్ అవుతోంది. క్రికెటర్ భువనేశ్వర్, యాంకర్ శ్యామల అక్కా తమ్ముళ్ళని..అందుకే వీరిద్దరికి పోలికలు కనిపిస్తాయని ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫోటో పై శ్యామల ఫన్నీ గా స్పందించారు..”ఈ విషయం నాకే తెలియదు.. పాపం వాళ్ళకి ఎలా తెలుస్తుంది” అంటూ తనదైన శైలి లో ఫన్నీ గా కౌంటర్ ఇచ్చారు.

You may also like