Home Filmy Adda “ఆంటీ” పదానికి సుమ రియాక్షన్ చూసారా..?

“ఆంటీ” పదానికి సుమ రియాక్షన్ చూసారా..?

by Anudeep

సోషల్ మీడియా లో ట్రోలింగ్కు పాల్పడేవారిపై యాంకర్ అనసూయ ఎప్పటికప్పుడు ఫైర్ అవుతూనే ఉంటారు. తనను సోషల్ మీడియా వేదికగా ఏజ్ షేమింగ్ చేస్తున్న వారిపై ఆమె మండిపడ్డారు. దీంతో కొన్ని రోజులుగా “ఆంటీ” అనే పదం ట్విట్టర్లో ట్రెండింగ్ లో ఉంది.

తాజాగా ఈ విషయానికి సంబంధించి యాంకర్ సుమ, అనసూయ మాట్లాడుకున్నట్టుగా ఉన్న ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Anchor suma reaction on Aunty word
ఆ వీడియోలో అనసూయ మాట్లాడుతూ.. “మీసాలు, గడ్డాలు ఉన్నవాళ్లు కూడా నన్ను ఆంటీ అంటున్నారు” అనగా దానికి సుమ స్పందిస్తూ ..” ఎవరో ఎదో అన్నారని..మనం అది అయిపోము.. మనం అనుకుంటే మాత్రమే అవుతాము..” అని అన్నారు. దీంతో అనసూయ స్పందిస్తూ ..” నా పిల్లల వయసున్నవారు, వారి స్నేహితులు ఆంటీ అని పిలిస్తే బావుంటుంది. అయిదేళ్ల లోపు పిల్లలకు మాత్రమే నేను ఆంటీని” అని అన్నారు.

ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింది. దీనిపై యాంకర్ సుమ అభిమానులు స్పందిస్తూ.. సుమ ఎంత బాగా చెప్పారు.. హుందాగా ఎలా ఉండాలో సుమ గారిని చూసి అనసూయ నేర్చుకోవాలంటూ ఆ వీడియో ని వైరల్ చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన “లైగర్” సినిమాకు సంబంధించి అనసూయ ఒక ట్వీట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది.

“కర్మ అనేది బూమరాంగ్ లాంటిది ఖచ్చితంగా తిరిగి వస్తుంది” అని అనసూయ ట్వీట్ చేశారు. దీంతో ఆమెపై ట్విట్టర్లో ట్రోల్ల్స్ మొదలయ్యాయి. తనపై వ్యతిరేక వ్యాఖ్యలు, ట్రోల్ల్స్ చేసే వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటానని యాంకర్ అనసూయ స్పందించారు. విజయదేవరకొండ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అర్జున్ రెడ్డి చిత్రం సమయంలో ఆ సినిమాలో అసభ్య కరమైన డైలాగ్లు ఉన్నాయంటూ యాంకర్ అనసూయ స్పందించారు. అప్పటి నుంచి ఆమెపై ఇంటర్నెట్లో ట్రోల్ల్స్ చేసేవారి సంఖ్య పెరిగింది. తాజాగా మరోసారి అనసూయ స్పందించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

watch video :

https://www.youtube.com/watch?v=JCvQF_pZSG8

You may also like