తన పెళ్లి చీర ధర ఎంతో చెప్పిన సుమక్క….అక్క రేంజ్ మామూలుగా లేదుగా అంటున్న అభిమానులు.!

తన పెళ్లి చీర ధర ఎంతో చెప్పిన సుమక్క….అక్క రేంజ్ మామూలుగా లేదుగా అంటున్న అభిమానులు.!

by Harika

Ads

బుల్లితెర యాంకర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Video Advertisement

టీవీ షోలు, మూవీ రిలీజ్ ఫంక్షన్ లోనే కాకుండా ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా భారీ ప్రేక్షక ఆదరణ పొందిన సుమ తనకు సంబంధించిన విషయాలను యూట్యూబ్ ఛానల్లో పోస్టుల ద్వారా అభిమానంతో పంచుకుంటారు.

Also Read:   ‘వీళ్ళకి రాఖీ మనమే కొనాలి.. గిఫ్టులు మనమే ఇవ్వాలి’ అంటూ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న టాప్ 12 మీమ్స్ !

ఈ క్రమంలో తాజాగా శ్రావణమాసం సందర్భంగా వరలక్ష్మీ వ్రతం పట్టుచీరల షాపింగ్ చేసిన సుమ తన షాపింగ్ కి సంబంధించిన వీడియో ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ వీడియోలో ఆమె షింఘానియా షాపింగ్ మాల్ యొక్క విశిష్టతను అందులో ఉన్న పట్టు చీరల యొక్క క్వాలిటీ మరియు ధర గురించి వివరంగా చర్చించారు.


ఇదిలా ఉండగా అక్కడ తనకు సుమ 15000 లోపు పట్టుచీర కావాలని చెప్పడంతో సేల్స్ మెన్ మేడం మీ రేంజ్ ఇది కాదు ఫస్ట్ ఫ్లోర్ అని అన్నప్పుడు సుమ మా రేంజ్ అదే అనుకుంటారు కానీ మేము తిరిగి ఇక్కడే కొనాల్సి ఉంటుంది అంటూ చమత్కారం చేశారు.
ఇకపోతే షాపింగ్ మాల్ లో నచ్చిన ఒక చీర ధర అడిగి అది రెండు లక్షల రూపాయలనీ తెలుసుకున్న సుమ “వామ్మో, ఇది చీరల షాపా ఆ బంగారం షాపా, నా పెళ్ళికి కూడా నేను ఇంత కాస్ట్లీ చీర కట్టలేదు.

 

నా పెళ్లి పట్టు చీర ఖరీదు ఎంతో తెలుసా కేవలం 11000 రూపాయలనీ చెప్పారు. కానీ అప్పట్లో 11 వేలు అంటే కాస్ట్లీ అనే కదా నీ అనుమానం. మా పెళ్లి ఎప్పుడో జరగలేదు ఈమధ్య రీసెంట్ గానే జరిగింది అని సరదాగా మాట్లాడారు.సుమ కనకాల హాస్యానికి చిరునామా అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.

Also Read:  అభిమానుల కోసం “అల్లు అర్జున్” 10 కోట్లు వదులుకున్నారా..? ఏం జరిగిందంటే..?


End of Article

You may also like