హీరో/హీరోయిన్స్ గా నటించిన “8” తెలుగు టీవీ యాంకర్స్..!

హీరో/హీరోయిన్స్ గా నటించిన “8” తెలుగు టీవీ యాంకర్స్..!

by Mohana Priya

Ads

చాలా మందికి సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల కల. సినిమా ఇండస్ట్రీ తాము కూడా యాక్టర్లు అవ్వాలని కోరుకుంటారు. కొందరైతే తాము హీరో/హీరోయిన్లుగా రాణించాలని ఆశపడుతుంటారు. అయితే, హీరో/ హీరోయిన్ గా అవకాశాలు రావాలంటే మాత్రం టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. యాక్టర్ గా ఎదగాలి అంటే పాపులర్ అవ్వాలి. అందుకు అందం మాత్రమే ఉంటే సరిపోదు. ప్రతిభ కూడా ఉండాలి. సరైన అవకాశాలను అందిపుచ్చుకోగలిగే నేర్పరితనం ఉండాలి. అలా చాలా మంది యాంకర్లు ముందు సినిమాలతో ఎంట్రీ ఇచ్చి తర్వాత టీవీ రంగంలో స్థిరపడినవారు లేదా టీవీ రంగంలో రాణిస్తూనే సినిమాల్లోకి హీరో లేదా హీరోయిన్ గా అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 శ్రీ ముఖి

శ్రీ ముఖి కూడా తొలుత యాంకర్ గానే తన కెరీర్ ను మొదలు పెట్టింది. 2009 లో అదుర్స్ ప్రోగ్రామ్ తో యాంకర్ గా పరిచయం అయింది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వచ్చింది. 2015 లో చంద్రిక సినిమాతో శ్రీముఖి హీరోయిన్ అవతారం ఎత్తింది.

#2 అనసూయ

ప్రస్తుతం టాప్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ వివాహం, పిల్లలు, వ్యక్తిగత జీవితం.. ఇవేవి కెరీర్ కు అడ్డం కావని నిరూపించింది. అనసూయ 2003 లోనే నాగ సినిమా తో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, 2016 వరకు సినిమాలలో కనిపించలేదు. 2013 లో వచ్చిన జబర్దస్త్, మోడరన్ మహాలక్ష్మి, భలే ఛాన్స్ లే, బిందాస్ వంటి షోలతో యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో అనసూయ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ వస్తుంది. కధనం సినిమాలో మెయిన్ రోల్ లో నటించి మంచి నటి అనిపించుకుంది.

anchor anasuya bharadwaj instagaram

#3 రష్మీ

రష్మీ ప్రస్తుతం టాప్ యాంకర్ గా కొనసాగుతుంది. 2007 లో వనితా టీవీలో యువ అనే ప్రోగ్రామ్ ద్వారా రష్మీ యాంకర్ గా పరిచయం అయింది. అంతకన్నా ముందే ఆమె సినిమాలలో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వచ్చింది. అయితే, రష్మీ యువ ప్రోగ్రాం తోనే అందరికి పరిచయం అయ్యింది. ఆ తరువాత, తెలుగులోనూ, తమిళ్ లోను పలు సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గాను, బుల్లి తెర టీవీ షోలలో యాంకర్ గాను చేస్తూ వచ్చింది. 2016 లో వచ్చిన గుంటూరు టాకీస్ సినిమా తో రష్మీ హీరోయిన్ గా పరిచయం అయింది.

#4 ప్రదీప్ మాచిరాజు

యాంకర్ ప్రదీప్ కూడా ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించారు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

#5 సుమ

యాంకర్ గా ఎన్నో సంవత్సరాల నుండి రాణిస్తున్న సుమ కూడా మొదట సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సినిమాలకు విరామం చెప్పి టీవీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు జయమ్మ పంచాయితీ సినిమా ద్వారా మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు సుమ.

suma-kanakaala-health-issues

#6 రవి

యాంకర్ రవి కూడా ఇది మా ప్రేమ కథ అనే సినిమాలో హీరోగా నటించారు.

12 anchor ravi

#7 కలర్స్ స్వాతి

కలర్స్ ప్రోగ్రాంలో యాంకర్ గా పని చేసిన స్వాతి ఆ ఛానెల్ పేరునే తన పేరు పక్కన చేర్చేసుకుంది. అందరికి కలర్స్ స్వాతిగా గుర్తుండిపోయింది. ఆ ప్రోగ్రాం తరువాత స్వాతి కి చాలానే అవకాశాలు వచ్చాయి. 2005 లోనే డేంజర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఓ వైపు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ, ప్లే బ్యాక్ సింగర్ గా కూడా రాణించింది.

#8 వర్షిని

యాంకర్ వర్షిని కూడా చందమామ కథలు, కాయ్ రాజా కాయ్ వంటి సినిమాల్లో నటించారు.

15 anchor varshini

వీరు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో మంది యాంకర్లు హీరోహీరోయిన్లుగా, లేదా ముఖ్య పాత్రల్లో ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.


End of Article

You may also like