నాతో చేయికలపండి…అందరికి కరోనా స్ప్రెడ్ చేద్దాం అన్నాడు…చివరికి పెద్ద ట్విస్ట్..!

నాతో చేయికలపండి…అందరికి కరోనా స్ప్రెడ్ చేద్దాం అన్నాడు…చివరికి పెద్ద ట్విస్ట్..!

by Anudeep

Ads

చేతిలో మొబైల్ ఉంది.. ఫ్రీ ఇంటర్నెట్ ఉంది.. ఫోన్లో ఎన్నో యాప్స్ అందుబాటులో ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా ఉపయోగిస్తే  కటకటాలపాలవ్వాల్సిందే.. ఫేక్ మెసేజెస్ ని  కాని, దుష్ఫ్రచారాని కాని వేటిని కూడా చూసి చూడనట్టు వదిలేసే ప్రసక్తే లేదు.. నువ్ ప్రపంచంలో ఏ మూల ఉన్నా అరెస్ట్ చేసి లోపల కూర్చోబెడతారు.. ఇందుకు ఉదాహరణ తాజాగా బెంగుళూరులో జరిగిన ఘటన..

Video Advertisement

“చేయి చేయి కలపండి.బయటకు వెళ్ళి బహిరంగంగా తుమ్మండి.కరోనా వ్యాప్తి చేయండి ” అని బెంగుళూరులోని ఇన్ఫోసిస్ కంపెనీలో పని చేస్తున్న ముజిబ్ మహమ్మద్ అనే యువకుడు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఒకవైపు ప్రపంచం అంతా కరోనా భయంతో బెంబేలెత్తుతూ ,ఇళ్ల నుండి బయటకి రాకుండా జాగ్రత్తలు పాటిస్తుంటే, మరోవైపు ఇలాంటి పోస్టులతో రెచ్చగొట్టడం కలవరపెడుతోంది.

సోషల్ మీడియాలో వైరలైన ఈ పోస్టు పెట్టిన ముజిబ్ మహమ్మద్ పై కేస్ ఫైల్ చేశారు బెంగళూర్ సిటి క్రైం పోలీసులు. మరోవైపు ఇన్ఫోసిస్ కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. తమ సంస్థకు చెందిన వ్యక్తి ఇలాంటి పోస్టు పెట్టడం విచారకరం అంటూ దర్యాప్తుకి ఆదేశించింది. అతన్ని ఉద్యోగం నుండి తొలగించింది.ఇదేవిషయాన్న ఇన్ఫోసిస్ అధికారిక ట్విటర్లో పోసట్ చేసింది.ఇలాంటి చట్టవ్యతిరేక పనుల్ని తమ సంస్థ ఎంతమాత్రం సహించదని, అది అతను పొరపాటున చేసిన పని కాదని , కావాలనే అలాంటి పోస్టు పెట్టాడని పేర్కొంది. చదువుకున్న మూర్ఖులుంటారనేదానికి ఇదో పెద్ద ఉదాహరణ.

కరోనా వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇన్ఫోసిస్ సంస్థకూడా తమ వంతుగా ప్రభుత్వాలకు సహకరిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనావైరస్ బారిన పడిన వారి ఆరోగ్య అవసరాలను తీర్చడానికి, వైద్య సదుపాయాల విషయంలో కూడా కర్ణాటక ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందిస్తోంది.

source: indiatimes


End of Article

You may also like