Ads
సూపర్ హిట్ అయిన సినిమాని రీమేక్ చేస్తే ఆ సినిమా కూడా హిట్ అవ్వాలని రూలు లేదు. ఒక్కొక్కసారి ఒరిజినల్ కంటే రీమేక్ సినిమాలే సూపర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అలాగే వేరే భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలని మన భాషలోకి రీమేక్ చేస్తే అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. కథాంశం ప్రాంతానికి భాషకు అతీతంగా ఒక విశ్వసనీయతను కలిగి ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది.
Video Advertisement
ఒక కామన్ సబ్జెక్టుతో నిర్మించిన ఒక కథ తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయితే అదే సబ్జెక్టుని రిమేక్ చేస్తే కన్నడలో సూపర్ హిట్ అయింది. ఆ సినిమా విశేషాలు ఏమిటో చూద్దాం. సింహాద్రి సూపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆంధ్రావాలా పెద్ద డిజాస్టర్. నిజానికి ఈ సినిమా ని భారీగా ప్రమోట్ చేసారు, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి అందించిన సాంగ్స్ జనాలను ఊపేసాయి. ఈ సినిమా హిట్ అని అందరూ డిసైడ్ కూడా అయిపోయారు.
అయితే 2004 జనవరి 1న విడుదల చేసిన ఈ సినిమా బెనిఫిట్ షో నుంచే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.ఈ సినిమాలో తండ్రి పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ వయసు ఒక మైనస్ పాయింట్ అయింది. నూనూగు మీసాల ఎన్టీఆర్ ని తండ్రి పాత్రలో అంగీకరించలేకపోయారు తెలుగు ప్రేక్షకులు. దాంతోపాటు సింహాద్రి తరువాత ఎన్టీఆర్ పై భారీ అంచనాలు ఉండటం కూడా ఈ సినిమాకు ప్రతిబంధకం అయింది.
అయితే ఇక్కడ డిజాస్టర్ అయిన ఈ సినిమాను కన్నడలో రీమేక్ చేసి ఇండస్ట్రీ హిట్ సాధించారు కన్నడ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్. ప్రాంతానికి తగ్గట్టు కథలో కొంచెం మార్పులు చేసి వీర కన్నడిగా టైటిల్ తో ఘనవిజయాన్ని సాధించిన ఈ సినిమాకి దర్శకుడు మన పూరి జగన్నాథ్ కావడం గమనార్హం. ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే సినిమా 50% సక్సెస్ సాధించినట్లే అదే పునీత్ రాజ్ కుమార్ కి అడ్వాంటేజ్ అయి ఉంటుంది.
End of Article