ఒకవైపు కరోనా భయం…మరోవైపు కాలు విరిగింది! అయినా తన డ్యూటీ ఆపలేదు..!!

ఒకవైపు కరోనా భయం…మరోవైపు కాలు విరిగింది! అయినా తన డ్యూటీ ఆపలేదు..!!

by Anudeep

Ads

కరోనాకి వ్యాక్సిన్ కనుక్కోవడానికి ప్రపంచవ్యాప్త శాస్త్రవేత్తలు , కరోనా సోకిన వారికి నయం చేయడానికి డాక్టర్లు, కరోనా వ్యాపించకుండా అరికట్టడానికి, ప్రజలు భౌతిక దూరం పాటించేలా చూస్తూ పోలీసులు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. వీళ్లంతా ప్రత్యక్షంగా కనపడుతుంటే పరోక్షంగా కరోనాతో ఫైట్ చేస్తున్నవారు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు.. ఇంటింటికి వెళ్లి కరోనా లక్షణాలున్న వారి గురించి వాకబు చేయడం, వారికి తగిన సూచనలు చేయడం ఇలా వీరి విధి..అలాంటి విధి నిర్వహణలో ఉన్న విమలకుమారి కథ విభిన్నం…

Video Advertisement

బీహార్ కి చెందిన 46 ఏళ్ల విమలకుమారి అంగన్‌వాడి వర్కర్‌. పాట్నా పట్టణంలోని లలిత భవన్ సమీపంలోని మురికి వాడలో నివసించే  విమలకు ముగ్గురు పిల్లలు, 23ఏళ్ల  కూతురు ,22 ఏళ్లు,18 ఏళ్ల వయసు కలిగిన ఇద్దరు కొడుకులు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే భర్త చనిపోయాడు..అప్పటి నుండి కుటుంబ బాద్యత విమలదే, ముగ్గురు పిల్లలూ చదువుతున్నారు.. 5,650రూ వచ్చే అంగన్వాడి వర్కర్ కొలువే జీవనాధారం. ఆమె పని ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి అందేలా చూడటం. ప్రస్తుతం కరోనా వ్యాధి లక్షణాలున్న వారి లెక్కలు సేకరించే సర్వే డ్యూటిలో ఉంది.

సర్వే చేయడానికి వచ్చే వారిపై జరుగుతున్న దాడులెన్నింటినో వార్తల్లో చూస్తూనే ఉన్నాం..అలాంటి దాడులన్నింటికి తట్టుకుని అవతల వ్యక్తులకి సర్ది చెపుతూ  నెలన్నర రోజులుగా సర్వే డ్యూటీలో పాల్గొంటుంది విమల.అందరిలానే తను డ్యూటీ చేస్తే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన పని లేదు..కానీ మార్చి నెలాఖరులో విమలకు కాలు విరిగింది.కర్ర సాయంతోనే ఒక్కరోజు డ్యూటికి సెలవు పెట్టకుండా తన విధులు నిర్వర్తిస్తుంది.

ఒకవైపు కాలు సరిగా లేదు, మరోవైపు కరోనా భయం, తన డ్యూటీ పాట్నాలోని మురికి వాడల్లోని ఇల్లులే, ఇన్ని  ప్రతికూలతల నడుమ కూడా ఇప్పటివరకు 380 ఇళ్లను సర్వే చేశారు విమల. చేతిలో ప్యాడు, పెన్నుతోపాటు ఒక చేతికర్ర సహాయంతో ఆమె ఆ ఇళ్లన్నీ తిరిగి వివరాలు రాసుకుంటోంది. సర్వేకోసం వెళ్లినప్పుడే ఒకరోజు రోడ్డుమీద నీళ్ల గుంటలో పడి ఆమె కాలు విరిగిపోయింది. దాంతో అప్పటి నుండి చేతికర్ర సాయంతో నడుస్తోంది.

ఉదయం ఎనిమిది గంటల నుండి మద్యాహ్యం పన్నెండున్నర వరకు ఇంటింటికి తిరగి సర్వే చేయాలి, ఎవరికైనా ఫ్లూ లక్షణాలున్నాయా తెలుసుకోవాలి..తర్వాత అదనపు డ్యూటీ వేరు.ఆరోగ్యం సహకరించట్లేదు, మరోవైపు కాలు నొప్పి సెలవు పెట్టు,మంజూరు చేస్తానని స్వయంగా పై అధికారే చెప్పినా, కూడా వినకుండా తన డ్యూటీ తను నిర్వర్తిస్తుంది..ఎందుకు ఇంత మొండి పట్టుదల అంటే విమల చెప్పే సమాధానం ఏంటంటే “‘‘నేను సెలవు పెడితే.. ఏ ఇంట్లో ఎవరు అనారోగ్యంతో ఉన్నారో తెలుసుకోలేను. అందువల్ల వాళ్లకు అవసరమైన తక్షణ వైద్య సహాయం అందకుండా పోతుంది. కాబట్టి నా పరిస్థితి కంటే, ప్రస్తుతం తన కర్తవ్యమే ముఖ్యమని”  చెప్తుంది..ప్రస్తుతం అందరూ యుద్దప్రాతిపదికన పనులు చేస్తున్న నేపధ్యంలో విమలలాంటి సైనికులే కదా దేశానికి  కావల్సింది.. హ్యాట్సాఫ్.

 

 


End of Article

You may also like