Ads
శ్రీలీల ఇప్పుడు ఈ పేరు టాలీవుడ్ లో ఒక సెన్సేషన్. పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన శ్రీ లీల ఇప్పుడు మోస్ట్ బిజిఎస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి హీరో సినిమాలను శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.
Video Advertisement
తన డాన్స్ మూమెంట్లతో క్రేజీ క్రేజీ ఎక్స్ప్రెషన్లతో యూత్ లో బాగా పాపులర్ అయింది. ప్రతి డైరెక్టర్ హీరోకి ఫస్ట్ ఛాయిస్ శ్రీ లీల అనే రేంజ్ కి వెళ్ళింది.
ప్రస్తుతం శ్రీ లీల నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ట్రైలర్లో బాలకృష్ణకి శ్రీ లీలకి మధ్య ఉన్న అనుబంధం ఆకట్టుకునే విధంగా ఉంది. భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ లో బాలయ్య తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల యాక్ట్ చేస్తే బాగుండు అని ప్రకటించారు అంటేనే తెలుస్తుంది శ్రీ లీలకు ఉన్న క్రేజ్.
భగవంత్ కేసరి సినిమా దసరా రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ జెట్ స్పీడులో చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. బాలయ్యను నెవర్ సీన్ బిఫోర్ అవతార్ లో ప్రెసెంట్ చేసినట్లు తెలిపారు. బాలయ్య శ్రీలీల మధ్య రిలేషన్ కూడా బాగా ఎస్టాబ్లిష్ అయింది అని టాక్. ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ అనిల్ రావుపూడి ఒక సీక్రెట్ రివీల్ చేశారు.శ్రీలీలకి తనకి మధ్య ఉన్న అనుబంధం కేవలం డైరెక్టర్ హీరోయిన్ మాత్రమే కాదు అని… అంతకుమించి అని అన్నారు.
శ్రీలీల తల్లి అయిన డా.స్వర్ణ అనిల్ రావిపూడికి దూరపు వరసలో అక్క అవుతుంది అంట.అనిల్ రావిపూడి శ్రీలీల తల్లి స్వర్ణ ఒంగోలులోని ఒకే ప్రాంతం నుండి వచ్చినట్టు తెలిపారు . ఈ విషయం భగవంత్ కేసరి సినిమాకి పనిచేస్తున్నప్పుడు తమకి తెలిసిందని అనిల్ రావిపూడి అన్నారు. ఆ లెక్కన చూస్తే శ్రిలీల తనకి మేనకోడలు వరుసవుతుందని తెలిపారు. సెట్స్ లో అందరి ముందు డైరెక్టర్ గారు అని పిలిచే శ్రీలీల ఎవ్వరూ లేనప్పుడు మాత్రం “మామా” అని పిలుస్తుందని రివిల్ చేశారు.హాలిడేస్ లో శ్రీలీల తన అమ్మమ్మ ఇంటికి వెళ్తూ ఉంటానని తెలియజేసింది.
End of Article