“యానిమల్” లో హీరో ఎంట్రీ సీన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం వీరేనా..?

“యానిమల్” లో హీరో ఎంట్రీ సీన్ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం వీరేనా..?

by kavitha

Ads

రణబీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ ఇండియాలో రూ. 500 కోట్ల మైలురాయిని, ప్రపంచవ్యాప్తంగా రూ. 900 కోట్ల మార్కును చేరుకుంది.

Video Advertisement

ఈ మూవీ ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం నటన, డైలాగ్స్ లేదా సినిమాటోగ్రఫీ మాత్రమే కాదు. సంగీతం కూడా ముఖ్య పాత్ర పోషించింది. సినిమాలో పాటల నుంచి నేపథ్య సంగీతం వరకు అన్నీ సూపర్‌హిట్‌. రణబీర్ కపూర్ ఎంట్రీ సాంగ్‌ హిట్ అయ్యింది. ఆ పాట అంత హిట్ కావడం వెనుక ఉంది ఎవరో ఇప్పుడు చూద్దాం..
యానిమల్‌ మూవీ రిలీజ్ అయిన తరువాత ఎక్కువగా చర్చించబడిన అంశాలలో రణబీర్ కపూర్ ఎంట్రీ సాంగ్ ఒకటి. ఈ సాంగ్ ఎఆర్  రెహమాన్ స్వరపరిచిన రోజా, దిల్ హై చోటా సా మరియు భారత్ హమ్‌కో జాన్ సే ప్యారా హై లాంటి మాషప్‌ తో చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కారణంగా ఈ సాంగ్  హిట్ అయ్యింది. ఈ సాంగ్ కు నేపథ్య సంగీతాన్ని అందించింది హైదరాబాద్‌కు చెందిన ప్రోగ్రెసివ్ రాక్ ఫ్యూజన్ బ్యాండ్ త్రీయరీ. ఈ పాటలో వీరు కనిపించారు.
త్రీయరీ బ్యాండ్ 2017లో హైదరాబాద్‌లో జరిగిన అర్జున్ రెడ్డి ఆడియో లాంచ్‌ ఈవెంట్‌లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆ పెర్ఫార్మెన్స్ కు సందీప్ రెడ్డి వంగా ముగ్ధుడై, యూట్యూబ్‌లో వారి పని కోసం వెతికాడు. వారు రూపొందించిన ఒక వీడియోను చూశాడు. యనిమాల్ హీరో ఎంట్రీ సాంగ్ కోసం వారిని తీసుకున్నాడు. తొమ్మిది మంది సభ్యుల గల బ్యాండ్ ఈ స్కోర్‌ను రూపొందించింది.
ఈ బ్యాండ్ ముగ్గురు వ్యక్తులతో 2013లో తెలంగాణలోని హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలుగు మరియు దక్షిణ భారత సంగీతంతో ప్రోగ్రెసివ్ రాక్ కలయికతో మ్యూజిక్ ను కంపోజ్ చేయడంలో వారికి  మంచి నైపుణ్యం ఉంది. 2013 నుండి ఈ బ్యాండ్ తొమ్మిది మందికి పెరిగింది. ఈ గ్రూప్ లో  కీస్‌పై మార్క్ టాలర్, వయోలిన్‌లో దత్త సాయి ప్రసా, డ్రమ్స్‌లో తరుణ్ విశాల్, డ్రమ్స్‌లో ఇంతియాకుమ్, గిటార్‌లో సెంటీలాంగ్ అవో, మహిళా గాయకుడిగా సింటీచే మోంగ్రో, పురుష గాయకుడు అఖిలేశ్వర్ చెన్ను, సితార్‌లో ఇర్ఫాన్ అహ్మద్, మరియు పవన్ కుమార్ ఎమ్.ఎస్. తబలా ఉన్నారు.

https://www.instagram.com/p/C0TM83PrkKh/?hl=en

Also Read: పల్లవి ప్రశాంత్ చేసిన తప్పు ఏంటి..? అసలు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు..?

 

 


End of Article

You may also like