అంజలి పడ్డ ఈ కష్టాల గురించి తెలుస్తే కన్నీళ్లొస్తాయి..! సొంతవాళ్లే తన ముందు అలా..!

అంజలి పడ్డ ఈ కష్టాల గురించి తెలుస్తే కన్నీళ్లొస్తాయి..! సొంతవాళ్లే తన ముందు అలా..!

by Anudeep

Ads

ఇంట గెలిచి రచ్చ గెలవమని సామెత.. కాని అంజలి మాత్రం రచ్చ గెలిచాక ఇంట గెలిచి చూపించింది. మనోళ్లందరూ నార్త్ నుండి హీరోయిన్స్ ని తెచ్చుకుంటారు.. మనోళ్లకి ఇక్కడ అవకాశాలు తక్కువ ,మళ్లీ తెలుగు అమ్మాయిలు పెద్దగా నటనంటే ఇష్టపడరు, ఎక్స్పోజింగ్ చేయరు అని ఒక ముద్ర..నటనంటే ఎక్స్పోజింగేనా అది తర్వాత మాట్లాడుకుందాం.. కాని మన తెలుగు అమ్మాయి అంజలి మాత్రం తమిళ్ లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది .గెలిచింది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది.

Video Advertisement

షాపింగ్ మాల్ సినిమాతో తమిళ ఛాన్స్ కొట్టేసిన అంజలి ఆ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత జర్నీ ద్వారా సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. ఆ రెండు సినిమాలు తెలుగులో డబ్ అయి అంజలికి పేరు తెచ్చిపెట్టాయి. అయితే ఈ రెండు సినిమాలకంటే ముందు ఫోటో అని ఒక తెలుగు హార్రర్ చిత్రంలోనటించింది అంజలి. ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ కాలేదు, అంజలికి అవకాశాలు తెచ్చిపెట్టలేదు.దాంతో తమిళ్ వైపు మొగ్గుచూపింది.

ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , గీతాంజలి ఇలా కొన్ని సినిమాల్లో నటించినప్పటికి గత కొంతకాలంగా సరైన అవకాశాలులేవు. అంతేకాదు కెరీర్ ప్రారంభంలోనే అంజలి కొన్ని వివాదాల్లో చిక్కుకుంది. అదే విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూల్లో ప్రస్తావిస్తూ “అవకాశాల కోసం నేను ఎప్పుడూ అంతగా ఎదురుచూడలేదు. రాలేదని బాధపడలేదు. కానీ ఆ మధ్య మా కుటుంబంలో జరిగిన గొడవలు ఎక్కువగా వైరల్ అయ్యాయి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసిపోయాయి ఆ సమస్యల కారణంగా నేను బాధపడుతున్నప్పుడు నన్ను ఓదార్చినవారు చాలా తక్కువమంది” అని చెప్పుకొచ్చింది.

సన్నిహితులు అనుకున్నవారే హేళనగా మాట్లాడేవారు , బాధించేవారు. నా పని అయిపోయింది అని నా ముందే కామెంట్ చేశారు , అప్పుడు జరిగిన గొడవల కన్నా ఆ మాటలే ఎక్కువ బాధపెట్టాయి. మానసికంగా ఆ మాటలు నన్ను గాయపర్చినా కూడా నాకు నేను ధైర్యం చెప్పుకుని మళ్లీ అవకాశాలు అందిపుచ్చుకున్నా. అప్పుడు అర్దం అయింది ఎవరైనా ఎదిగితే పక్కకి జరిగి ప్రేమ కురిపిస్తారు. అదే కెరీర్ ఇబ్బందుల్లో ఉంటే నిర్దాక్షిణ్యంగా వదిలేసిపోతారు. ఇలాంటి చేదు అనుభవాలు ప్రతి హీరోయిన్ ఎదుర్కొనే ఉంటుంది అని చెప్పి బాధపడింది.

ఒకప్పుడు బొద్దుగా ఉండే అంజలి ప్రస్తుతం నాజూగ్గా మారిపోయింది. సాధారణంగా బొద్దుగా ఉండే హీరోయిన్స్ ని ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడరు . కాని అంజలి విషయంలో మాత్రం బొద్దుగా ఉన్నప్పుడే బాగుండేది అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అంజలి నటించిన నిశ్శబ్దం సినిమా విడుదలకు సిధ్దంగా ఉంది. ఇందులో కాప్ క్యారెక్టర్ చేస్తుంది. మరిన్ని తమిళ సినిమాల్లో నటిస్తోంది.


End of Article

You may also like