అన్నం పెట్టిన చేతులతోనే చితకొట్టింది… ఎందుకో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు!

అన్నం పెట్టిన చేతులతోనే చితకొట్టింది… ఎందుకో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు!

by Anudeep

Ads

“ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే” అన్నట్టుగా మద్యం షాపులు ఓపెన్ అనగానే మందుబాబులు గాల్లో తేలారు. ఎప్పెడెప్పుడు తెరుస్తారా అని కళ్లల్లో వత్తులేసుకుని ఎదురు చూసిన మందుబాబుల కలలు తీరే రోజులు వచ్చాయి.మద్యం షాపుల ముందు బారుల తీరిన జనాల గురించి రకరకాల కామెంట్స్ వినిపించాయి..వాటిల్లో ముఖ్యంగా వీరి గురించా ఇన్నాళ్లు మనం బాధపడ్డాం, దానాలు చేశాం అని చాలామంది వాపోయారు.ఒక మహిళ అయితే ఒక అడుగు ముందుకేసి మందుల బాబులందరికి బడిత పూజ చేసింది.

Video Advertisement

ఒక్కపూట మందు లేకపోతేనే శివరింగ్ వచ్చే మందుబాబులు , నెలన్నర పాటు నోరు కట్టేసుకుని కూర్చున్నారు. మద్యం షాపులు తెరవడంతో అందరూ షాపుల ముందు బారులు తీరారు..షాపులు తెరవగానే సోషల్ డిస్టెన్స్, మాస్కులు ఇవేవి లేవు, ఒక్కరిలో కరోనా భయంలేదు..ఒకరి మీద ఒకరు పడుతూ చేతికందిన సీసాతో ఏదో పోటీల్లో ప్రైజ్ గెలుచుకున్నట్టుగా పోజు కొట్టారు,.

మరోవైపు గృహహింసకి ప్రధాన కారణంగా చెప్పుకునే మద్యం  లేకపోవడంతో ఇంట్లో వాళ్లు సంతోషంగా ఉంటే, నెల రోజులుగా ఉన్న వారి సంతోషం ఒక్క రోజులో ఆవిరైపోయింది.మళ్లీ మందు తాగడానికి , తాగొచ్చి పెళ్లాం పిల్లల్ని కొట్టడానికి మందు బాబులు సిద్దం అయ్యారు..ఒక్కొక్కరు పదేసి బాటిల్స్ పట్టుకుంటూ, ఒకడు ఏకంగా పాముని కొరికి మెడలో వేసుకుని వచ్చి మందు బాబులు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు..

లాక్ డౌన్ ప్రకటించడంతో పనులు లేకపోవడంతో చాలామందికి ప్రభుత్వాలతో పాటు, కొన్ని స్వచ్చంద సంస్థలు ,ఇండివిడ్యుయల్ కొంతమంది వ్యక్తులు వారికి తోచిన సాయం చేశారు. మద్యం కొనుగోలు చేసిన వారిలో చాలామంది మధ్యతరగతి , దిగువ మద్యతరగతి వారే ఉన్నారు. వీరికా ఇన్ని రోజులు సాయం చేసాం అని కొంతమంది బాధపడితే , ఒక మహిళ మాత్రం ఒక కర్ర పట్టుకుని మద్యం షాపు దగ్గరకి వెళ్లి మందుబాబులందరిని చితకబాదింది..

నిన్నా మొన్న మీకు తినడానికి తిండి లేదు ,కానీ ఇప్పుడు డబ్బులు ఎలా వచ్చాయి రా అంటూ, ఒక్కొక్కరిని కర్ర తీసుకుని తరిమి తరిమి కొట్టింది.పక్కనే ఉన్న పోలీసులు మహిళను వారించలేదు, కొందరు ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..చాలా మంది వారికి తగిన బుద్ది చెప్పారు అంటూ మహిళ చేసిన పనికి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు.


End of Article

You may also like