టాలీవుడ్ యాక్ట్రెస్ అన్నపూర్ణమ్మ ఇటీవల రాజీవ్ కానుకలపై ఫైర్ అయ్యిన సంగతి తెలిసిందే. ఆమె ల్యాండ్ విషయమై రాజీవ్ కుటుంబం మోసం చేసిందంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 22 ఏళ్ల క్రితమే దేవాదాస్ కనకాల వద్ద భూమి కొన్నానని… తనకు అమ్మిన భూమినే వేరొకరికి అమ్మారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

annapurnamma

అయితే.. ఈ వ్యవహారం ఇంకా ముగియకముందే.. నెట్టింట్లో మరో వీడియో వైరల్ అవుతోంది. స్టార్ మ్యూజిక్ ఛానల్ లో ప్రసారం కాబోయే “గడసరి బామ్మలు..సొగసరి భామలు” షో కి అన్నపూర్ణమ్మ హాజరు అయ్యారు. ఈ షో కి సుమ యాంకర్ గా చేస్తున్నారు. అయితే.. ఇటీవల విడుదల అయిన ప్రోమో లో అన్నపూర్ణమ్మ సుమతో చాలా క్లోజ్ గా కనిపించారు. ఇన్ని గొడవలు ఉండి, ఈ షో కి అన్నపూర్ణమ్మ ఎలా హాజరు అయ్యారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Watch Video: