ఆంధ్ర ప్రజలకు మరో షాకింగ్ న్యూస్.. మరో తుఫాను..? రాబోయే మూడు రోజులు మరింత కీలకం..హై అలెర్ట్..!

ఆంధ్ర ప్రజలకు మరో షాకింగ్ న్యూస్.. మరో తుఫాను..? రాబోయే మూడు రోజులు మరింత కీలకం..హై అలెర్ట్..!

by Anudeep

Ads

గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలు వరద భీభత్సంతో అల్లాడుతున్న సంగతి తెలిసిందే. వరసగా వర్షాలు పడుతుండడంతో వరద తలెత్తి రాష్ట్రంలో పలు చోట్ల ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఇవి ఇంకా సద్దుమణగనే లేదు అప్పుడే మరో ఇబ్బందికర పరిస్థితి రాబోతోంది.

Video Advertisement

ఇప్పుడిప్పుడే ఆంధ్ర రాష్ట్రాలు కోలుకుంటున్నాయి అనుకునేలోపే మరో ఇబ్బంది రాబోతోంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

cyclone 1

దక్షిణ థాయిలాండ్ పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరిక విడుదల చేసింది. దీనిపై అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం మధ్యస్థ స్థాయి ట్రోపోస్పేయర్‌ వరకు వ్యాపించి ఉన్నట్లు తెలుస్తోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశ వైపు ప్రయాణిస్తూ రేపు వాయుపీడనంగా మారనుందని పేర్కొంది.

cyclone 2

తర్వాత 24 గంటల్లో బంగాళాఖాతం కేంద్రంగా పెను తుఫాను వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తరువాత మరింత బలపడి డిసెంబరు 4వ తేదీ నాటికి ఉత్తరాంధ్ర- ఒడిశా తీరానికి చేరే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఈ లెక్కన, డిసెంబరు 3, 5 తేదీల్లో కోస్తాంధ్ర లో పలు ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో అధికారులు లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాల వలన చెరువుల్లోనూ, వాగుల్లోనూ, బావుల్లోనూ నీరు అలానే ఉంది. చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు ఇంకా ఇంకిపోలేదు. ఈ క్రమంలో తిరిగి వర్షాలు పడితే.. పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.


End of Article

You may also like