విశాఖ లో మరో అగ్ని ప్రమాదం.. దట్టం గా వ్యాపిస్తున్న పొగ..పరుగులు పెడుతున్న జనాలు..!

విశాఖ లో మరో అగ్ని ప్రమాదం.. దట్టం గా వ్యాపిస్తున్న పొగ..పరుగులు పెడుతున్న జనాలు..!

by Anudeep

Ads

విశాఖ ను వరుస అగ్నిప్రమాదాలు చుట్టుముట్టాయి. గతేడాది రెండు సార్లు అగ్నిప్రమాదం బారిన పడ్డ విశాఖ తాజాగా మరో సారి అగ్నిప్రమాదం బారిన పడింది. విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం తో ఒక్కసారిగా విశాఖ వాసులు ఉలిక్కిపడ్డారు.

Video Advertisement

visakha fire accident

హెచ్‌పీసీఎల్‌లో ఒక్కసారి గా సేఫ్టీ సైరన్ మోగడం తో ఉద్యోగులందరూ పరుగులు తీశారు. ఉన్నట్లుండి పెద్ద గా శబ్దం రావడం తో అక్కడి ప్రజలు సైతం భయం తో పారిపోయారు. హెచ్‌పీసీఎల్‌లో ప్రస్తుతం సాధారణం గా వచ్చే కంటే దట్టం గా పొగలు వ్యాపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

visakha fire accident


End of Article

You may also like