Chai-Sam: అక్టోబర్ 7 న చై-సామ్ ఏం చెప్పబోతున్నారు..? ఆరోజే చెప్పడానికి కారణం ఏంటి..?

Chai-Sam: అక్టోబర్ 7 న చై-సామ్ ఏం చెప్పబోతున్నారు..? ఆరోజే చెప్పడానికి కారణం ఏంటి..?

by Anudeep

Ads

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన సమంత పేరే వినిపిస్తోంది. ఆమె పై వస్తున్న రూమర్ల సంగతి పక్కన పెడితే..ఆమె సోషల్ మీడియా లో ఆక్టివ్ గానే కనిపిస్తున్నారు. కానీ సోషల్ మీడియా లో వారి జంట పై వస్తున్న రూమర్ల పై మాత్రం ఆమె స్పందించడం లేదు. గత కొన్ని రోజులుగా రకరకాల కథనాలను సోషల్ మీడియా లో చూస్తూనే ఉన్నాం.

Video Advertisement

samantha chaitanya

అయితే, నాగ చైతన్య ఈ విషయమై స్పందించినప్పటికీ… వారి విడాకుల వ్యవహారం నిజమా? కాదా? అన్న విషయమై స్పష్టత ఇవ్వలేదు. దీనితో.. ఈ రూమర్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మరో వైపు నెట్టింట్లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అక్టోబర్ 7 న వీరిద్దరూ కలిసి వారి బంధం పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది అని ఈ వార్తల సారాంశం. ఇది ఎంత వరకు వాస్తవం అన్న సంగతి తెలియదు. కానీ, చై-సామ్ అభిమానులు మాత్రం ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 7 న వారు నాలుగో యానివర్సరీ జరుపుకోవాల్సి ఉంది. దీనితో.. ఆ రోజు ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది అని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు.


End of Article

You may also like