“నా పిల్లల కోసమే ఫైట్ చేస్తున్నా”…కన్నీళ్లు పెట్టిస్తున్న సీరియల్ నటి బాబీ లహరి రియల్ స్టోరీ..!

“నా పిల్లల కోసమే ఫైట్ చేస్తున్నా”…కన్నీళ్లు పెట్టిస్తున్న సీరియల్ నటి బాబీ లహరి రియల్ స్టోరీ..!

by Anudeep

Ads

మనం ఎలా ఉన్నా.. మనల్ని కడదాకా ప్రేమించేది కన్న తల్లి ఒక్కటే. మిగిలిన వారు అందరు ఎదో ఒక స్టేజి లో మనల్ని దూరం పెట్టచ్చు.. కానీ, కన్న తల్లి మాత్రం మనం ఎలా ఉన్నా మనలని ప్రేమిస్తూనే ఉంటుంది. బంగారు పంజరం, అంతః పురం సీరియల్ ఫేమ్ నటి బాబీ లహరి గుర్తుంది కదా. ప్రస్తుతం ఆమె అనుభవిస్తున్న మనోవేదన వర్ణనాతీతం.

Video Advertisement

bobby lahari

ఆమె ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు జన్మించారు. రెండవసారి బాబు పుట్టినప్పుడు ఆరోగ్యం గానే పుట్టినా.. కార్పొరేట్ వైద్యుల కారణం గా అంగవైకల్యాన్ని పొందాల్సి వచ్చింది. ఈ సమయం లో ఆమెకు అండగా నిలబడాల్సిన వాళ్ళే ఆ బిడ్డను వదిలించుకోవాలి అంటూ సలహాలు ఇవ్వడం తో ఆమె చాలా వేదన చెందారు. పుట్టింటివారికి, అత్తింటివారికి, చివరకు భర్తకు కూడా దూరమై ఒంటరిగా ఇద్దరు పిల్లలని సాకుతున్నారు.

anthapuram baaby lahari 2

image credits: indiancelebblog.com

ఆమె కూతురు అనన్య పేరు మీదఅనుధ ఆశ్రయ్ అనే ఎన్జీఓ ఛారిటిని నిర్వహిస్తున్నారు. “అను పుట్టేటప్పటికీ.. ఇలాంటి ఒకరోజు ను నేను ఫేస్ చేయాల్సి వస్తుంది అని ఎప్పుడు అనుకోలేదు..” అంటూ లహరి తన బాధ ను పంచుకున్నారు. “ఇలాంటి లైఫ్ కూడా ఉంటుందా అనిపించేది. నా బిడ్డ పుట్టినపుడు సంపూర్ణ ఆరోగ్యం తోనే ఉండేవాడు. అయితే.. డాక్టర్లు కావాలనే వెంటిలేటర్ పై ఉంచేవారు.

anthah puram baaby lahari

డబ్బు కోసమే వాళ్ళు ఇలా చేశారు.. అందరు దీనిని ఒప్పుకోరు. ఇల్లు, ఆస్తి, కార్లు ఇలా ఏవి పోయినా బాధ ఉండదు. కానీ ఓ లైఫ్ ఇలా అయింది. బాబుతో పాటు అందరం ఇబ్బంది పడుతున్నాం.. ఇద్దరు పిల్లలకు నాకు సిజేరియన్ ఆపరేషన్ అయింది. బిడ్డను చూపించి.. పూర్తి ఆరోగ్యం గా ఉన్నాడు అని తెలిసిన తరువాత మా ఆయనను ఒప్పించి ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయించుకున్నా. ప్రతి నెల చెక్ అప్ కి వెళ్తూ మంచి గా ట్రీట్మెంట్ తీసుకున్నా..

bobby lahari

మనకి ఏదైనా ఇంజక్షన్ చేస్తేనే మనం ఏంటి..? ఎందుకు..? అని అడుగుతాం. పిల్లల విషయం లో కూడా ఇలానే ఉండాలి. ఎందుకు ఏమి ట్రీట్మెంట్ చేస్తున్నారో తెలుసుకోవాలి. అను పాపా పుట్టినపుడు 29 రోజుల పాటు వెంటిలేటర్ పై ఉంచారు. ఎందుకు అని అడిగితె.. ఆక్సిజెన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పేవారు. రెండు, మూడు గంటలకు మించి బతకకపోవచ్చని కూడా చెప్పేవారు. అప్పటికే సిజేరియన్ అయి ఉన్న నేను మూడు ఫ్లోర్ లు నడుచుకుంటూ వెళ్లేదాన్ని. పిచ్చి దానిలా తిరిగేదాన్ని..” అంటూ లహరి ఆరోజులను గుర్తు చేసుకున్నారు.

bobby lahari 2

“అందరు ఇలానే చేస్తారని కాదు.. ఇలాంటి టీకాలు వేసేవాళ్ళకే చెబుతున్నా.. ఇది వార్నింగ్ అని అనుకుంటారో.. ఏమైనా అనుకోండి.. నా బిడ్డని ఇంత బాధపెట్టినవారెవరు ఆనందంగా ఉండరు.. అసలు చిన్న పిల్లల జీవితాలతో ఆడుకోవాలని ఎలా అనిపిస్తుందో తెలియదు.. ఇలాంటి పరిస్థితి వలన నా లైఫ్ లో అన్ని కోల్పోయాను. నా ఫామిలీ స్పాయిల్ అయిపొయింది. నాకంటూ ఏమి ఉంది అని చూసుకుంటే.. ఏమి లేదు.. కానీ.. నా పిల్లల కోసం మాత్రం నేను ఉన్నాను. నా పిల్లల కోసమే ఫైట్ చేస్తున్నా.. ఫైట్ చేస్తూనే ఉంటా. ఇది నా బరువు అని కాదు బాధ్యత అని భావిస్తా..” అంటూ చెప్పుకొచ్చారు.


End of Article

You may also like