Ads
కొందరి సినీ జీవితాలు సక్సెస్ లేక అర్ధాంతరంగా ముగిస్తారు..మరి కొందరు పెళ్లి అయ్యాక తమ పర్సనల్ లైఫ్ కోసం ముగిస్తూ ఉంటారు..కానీ దురదృష్ట వశాత్తు కొందరు సక్సెస్ లో ఉండి కూడా కొన్ని అనుకోని సంఘటనల వలన వదిలేసుకోవలసి వస్తుంది..ఇదే కోవలోకి వస్తారు హీరోయిన్ మహిమ చౌదరి.హీరో శ్రీకాంత్ సరసన పలు సినిమాలలో నటించిన మహిమ చౌదరి తన సినీ లైఫ్ పీక్స్ లో ఉండగా అనుకోని ఒక సంఘటన వలన సినీ జీవితం తలకిందులు అయినట్టు చెప్పుకొచ్చింది.
Video Advertisement
ఇంతకీ ఏమైంది అంటే..తన సినీ ప్రస్థానాన్ని తలకిందులు చేసిన ఆ ఘటన ఏంటి అంటే..బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తో సినిమా షూటింగ్ కోసం బెంగళూరు జరుగుతున్న సమయంలో మహిమ ప్రయాణిస్తున్న కారును ఒక ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదం లో మహిమ తీవ్ర గాయాల పాలు అయ్యారు..ఆ ప్రమాదం లో మహిమ మొహం మీద 67 గాజు ముక్కలు గుచ్చుకున్నాయట..ఆ ప్రమాదం తనకు అయిన గాయాలే తన కెరీర్ కి శాపంగా మారాయి అని ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.
ఎన్నో నిద్ర లేని రాత్రుళ్ళు గడిపానని,తన మొహం పై ఏర్పడ్డ మచ్చలు చూసి ఏడ్చేదాన్ని అని చెప్పారు.తిరిగి గాయాల నుంచి కోలుకున్నా తనకు మునుపటి లాగా తన కెరీర్ ని అందుకోలేక పోయనంటూ వాపోయారు.ఎంతయినా ఒక స్టార్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఇలాంటివి జరగడం నిజంగా బ్యాడ్ లక్ కదూ!
End of Article