Ads
కొన్నేళ్ల క్రితం చిన్న గా మొదలైన యూట్యూబ్ ఈ రోజు ప్రపంచాన్ని ఎలా శాసిస్తోందో మనందరం చూస్తూన్నాం… గత 15 ఏళ్ళుగా ఎన్నో కోట్ల ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి. ఎంతో మందికి పేరు తెచ్చి పెట్టింది. మరికొంతమందికి డబ్బులిస్తుంది…. ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది. అలాగే ఎందరో టాలెంట్ ఉన్నవాళ్ళని స్టార్స్ ని చేసింది.
Video Advertisement
అయితే యూట్యూబ్ ద్వారా కొందరు స్టార్స్ అవుతుంటే.. కొందరు సెలెబ్రెటీలు కూడా యూట్యూబ్ వైపే చూస్తున్నారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ డిజిటల్ మీడియా వైపే ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి వ్యాపార ప్రకటనలకు ఇప్పుడు యూట్యూబ్ అతిపెద్ద వేదికగా మారింది. స్మార్ట్ స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని ఇలా డిజిటల్ రంగం అభివృద్ధి చెందడం గత రెండు మూడేళ్లుగా బాగా కనిపిస్తుంది. ఇలా యూట్యూబ్ ఎన్నో రకాలుగా మన జీవితంలో భాగం అయిపోయింది.
అయితే యూట్యూబ్ ద్వారా ఎందరో సామాన్యులు స్టార్స్ గా మారారు. వారిలో ఒకరే చందన ప్రియా వడయార్. ఈమె ఆంధ్రప్రదేశ్ లోని నగరికి చెందిన యువతి. నిన్న తిరుపతిలో జరిగిన ‘ఆది పురుష్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈమె మెరిసింది. ఈమె చూడ్డానికి కాస్త హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లాగ ఉండేసరికి.. ఎవరు ఈ అమ్మాయి అంటూ నెటిజన్లు సెర్చింగ్ స్టార్ట్ చేసారు.
చందన ప్రియా వడయార్ సిద్దార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి సివిల్ ఇంజనీర్ పట్టా అందుకున్నారు. ఈమెకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. 2018 లో ఈ ఛానెల్ ను స్టార్ట్ చేసారు. ఇందులో ఆమె తన జీవితం లోని విశేషాలతో పాటు, తన వృత్తి, ఇంకా మరి కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని పోస్ట్ చేసింది. ఈమె ఛానెల్ కి పన్నెండు వందలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
ఈమె జెమినీ మ్యూజిక్ లో కూడా కొన్నాళ్ళు గెస్ట్ యాంకర్ గా పని చేసింది. ప్రస్తుతం ఈమె సివిల్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఈమె కొన్ని బ్రాండ్స్ కి మోడల్ గా చేసారు. ఈమెకు ఈ ఏడాది వివాహం జరిగింది. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే చందన ప్రియకు ఇంస్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారు. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఈమె ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
https://www.instagram.com/p/CrF3NIGg7OY/
Also read: దసరా సినిమా “చమ్కీల అంగిలేసి” పాట రీల్ తో… ఫేమస్ అయిన ఈ “అమ్మాయి” ఎవరో తెలుసా..?
End of Article