Ads
అనుపమ పరమేశ్వరన్ ‘డీజే టిల్లు’ మూవీతో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. మలయాళ ‘ప్రేమమ్’ మూవీతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి, పాపులర్ అయ్యింది. ఆ మూవీలోనీ అనుపమ నటనకు తెలుగులో కూడా ఆఫర్స్ వచ్చాయి. అలా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అఆ’ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
Video Advertisement
ఉంగరాల జుట్టుతో ,పెద్ద కళ్లతో, పక్కింటి అమ్మాయిలా కనిపించి తొలి మూవీతోనే తెలుగు యువ హృదయాలను అనుపమ దోచేసింది. సినిమాలలో ఆమె చేసే పద్దతైన పాత్రలతోనే కాకుండా, ఆఫ్ స్క్రీన్లో అనుపమ కనినిపించే తీరుకి కూడా యూత్ ఫిదా అయ్యారు. తాజాగా ఆమె డీజే టిల్లుకు తీసుకున్న రెమ్యూనరేషన్ నెట్టింట్లో వైరల్ గా మారింది.
అనుపమ పరమేశ్వరన్ డీజే టిల్లు మూవీకి ముందు నటించిన సినిమాల అన్నింటిలో పద్ధతిగా ఉండే పాత్రలలో నటించి అలరించింది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయిన ‘డీజే టిల్లు 2’ ట్రైలర్ తో అందరికి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. ఎప్పుడూ క్లాస్ గా ఉండే అనుపమ ఈ ట్రైలర్ లో హీరో సిద్ధుతో ముద్దు సన్నివేశంలో కనిపించింది. అంతేకాకుండా హాట్ లుక్స్ లో కనిపించింది. కెరీర్ మొదటి నుండి సాంప్రదాయంగా ఉన్న పాత్రలలో నటించిన అనుపమ ఇప్పుడు తగ్గట్లేదు.
లిప్ లాక్స్, స్కిన్ షో చేయడం అనుపమ అభిమానులకు కూడా నచ్చడం లేదు. ఈ మలయాళీ బ్యూటీ ఫ్యాన్స్ ట్రైలర్ చూసి బాధ అవుతున్నారు. తమ అభిమాన హీరోయిన్ ని ఇలా చూస్తుంటే బ్రేకప్ కన్నా ఎక్కువగా బాధ కలుగుతొందని సోషల్ మీడియాలో తమ ఆవేదనను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఒక అభిమాని అనుపమ తీరు నచ్చడం లేదంటూ ఒక ఎమోషనల్ వీడియో కూడా షేర్ చేయగా, అది వైరల్ గా మారింది. అయితే అనుపమ ఇలా నటించడం కోసం పారితోషికం బాగానే తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ ముందువరకు ఒక్కో మూవీకి కోటి రూపాయల నుండి కోటిన్నర మధ్య పారితోషికం అందుకున్న అనుపమ, ‘టిల్లు స్వ‍్కేర్’ మూవీ కోసం ఏకంగా 2 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తోంది.
Also Read: అరబిక్ కుతూ సాంగకి స్టెప్పులేసిన ప్రొడ్యూసర్.. ఫ్యామిలీ ఫంక్షన్ లో సందడి చేసిన దిల్ రాజు!
End of Article