Ads
టాలీవుడ్ నటుడు నాగయ్య తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. నాగయ్య చాలా మందికి సుపరిచితులు. ఈయన వేదం మూవీ లో శ్రీను అనే ఓ బాబు కు తాత లాగ నటించి.. ఆ సినిమా చూసిన వారందరిచేతా కన్నీరు పెట్టించారు. ఆ సినిమా లో బన్నీ తో కూడా ఆయన తాత అని పిలిపించుకుంటారు. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా రిలీజ్ అయినప్పటినుంచి ఆయన పేరు “వేదం” నాగయ్య గా మారిపోయింది.
Video Advertisement
ఆ సినిమా తరువాత కూడా నాగయ్య పలు సినిమాల్లో నటించారు. వయసు మీద పడ్డా, ఆయన తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. దాదాపు 30 సినిమాలలో నాగయ్య నటించారు. రామయ్య వస్తావయ్యా, లీడర్, స్పైడర్, నాగవల్లి వంటి సినిమాలు నాగయ్య కి మరింత గుర్తింపు తీసుకొచ్చాయి. ఆయన ఆర్ధిక సమస్యల కారణం గా సినిమాల్లో నటించడం ప్రారంభించారు. అయినప్పటికీ, ఆర్ధిక ఇక్కట్లు తీరలేదు. చాలా సార్లు అవకాశాలు అంతగా రాలేదని, ఆర్ధిక ఇబ్బందులున్నాయని సన్నిహితులతో చెప్పుకునేవారట.
నాగయ్య మరణవార్త తెలిసిన తరువాత, వేదం లో నాగయ్య సహనటి అనుష్క శెట్టి స్పందించింది.
ఇన్స్టాగ్రామ్ మాధ్యమం ద్వారా ఆమె నాగయ్య కు సంతాపం తెలిపింది. “ఈరోజు ఓ మంచి ఆత్మ లోకాన్ని వీడిపోయింది. ఈ విషాదం నుంచి నాగయ్య గారి కుటుంబం త్వరగా కోలుకోవాలని, వారిని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి” అని ట్విట్టర్ మాధ్యమం లో పేర్కొంది. వేదం మూవీ ఈవెంట్ లో నాగయ్య తో కలిసి ఉన్న పిక్చర్ ను కూడా షేర్ చేసింది. ఆమె తరువాత దర్శకుడు క్రిష్ కూడా స్పందించారు. ” రాములు గారు మీరు మీ మగ్గనికి సెలవిచ్చారు.. కానీ, మీరెప్పటికీ ఉంటారని” ట్విట్టర్ లో రాసుకొచ్చారు. నాగయ్య మృతి మీడియా పట్టించుకున్నంత గా సినీ ఇండస్ట్రీ పట్టించుకోలేదని చాలా మంది భావిస్తున్నారు.
View this post on Instagram
Also check : వామ్మో ‘వకీల్ సాబ్’ బెనిఫిట్ షో టికెట్ ధర ఎంతో తెలుసా ?
End of Article