Home News “పాపని చూడాలని ఉంది” అంటూ వీడియో కాల్.. అంతలోనే ఘోరం.. కన్నీళ్లు పెట్టిస్తున్న హెలికాప్టర్ ప్రమాదం..!

“పాపని చూడాలని ఉంది” అంటూ వీడియో కాల్.. అంతలోనే ఘోరం.. కన్నీళ్లు పెట్టిస్తున్న హెలికాప్టర్ ప్రమాదం..!

by Anudeep

తమిళనాడు పరిసర ప్రాంతాల్లో భారీ హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రక్షణ దళాల ప్రధాన అధిపతి బిపిన్ రావత్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర అధికారులతో కలిసి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయింది.

ఈ వార్తతో యావత్ దేశం షాక్ లో మునిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ దుర్ఘటనపై సమీక్ష నిర్వహిస్తున్నారు. కాగా.. తమిళనాడులోని కూనూర్ ప్రాంతంలో ఉండే దట్టమైన మంచు కారణంగానే హెలికాప్టర్ కూలిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ దుర్ఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది.

Also Read: తరతరాలుగా ఆర్మీ లోనే.. బిపిన్ రావత్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? 42 ఏళ్ళ ఆర్మీ ప్రస్థానం..!

saiteja 1

ఈ హెలికాప్టర్ లో అత్యున్నత భద్రతా ప్రమాణాలను పాటిస్తారు. ఈ హెలికాప్టర్ రష్యాకు చెందిన ఖజన్ హెలికాప్టర్స్ లో rassi a రకానికి చెందిన హెలికాప్టర్.  ఇంత పకడ్బందీగా ఉన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురి కావడం దురదృష్టకరం. ఈ ప్రమాదం అనేక అనుమానాలకు, చర్చలకు తావిస్తోంది. ఈ ప్రమాదంలో ఆర్మీ దళానికి చెందిన 13 మంది దుర్మరణం చెందారు. వారిలో ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ఎగువ‌రేగ‌డి గ్రామానికి చెందిన సాయితేజ కూడా ఉన్నారు. సాయితేజ మరణంతో ఎగువ‌రేగ‌డి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి కుటుంబం మదనపల్లిలో నివసిస్తోంది.

saiteja 2

సాయితేజ్ బిపిన్ రావత్ కు సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. బుధ‌వారం ఉద‌యం 8.30 గంట‌ల‌ సమయంలో ఆయన తన భార్యా పిల్లలతో వీడియో కాల్ చేసి మాట్లాడారు. పాపని చూడాలని ఉంది అంటూ సాయితేజ భార్యతో మాట్లాడారు.. భార్య శ్యామలతో ఆయన అదే చివరిసారిగా మాట్లాడారు. ఆ తరువాత కాసేపటికి హెలికాప్టర్ ప్రమాదం జరగడంతో.. ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మరణవార్త తెలియడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఏపీ సీఎం జగన్ కూడా సాయితేజ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

Also Read: “RRR ట్రైలర్”లో ఈ 10 ఆసక్తికర విషయాలను గమనించారా..?

You may also like