దోషుల తరపు లాయర్ సంచలన వ్యాఖ్యలు…నిర్భయ తల్లిని శిక్షించాలి! నెటిజెన్స్ ఫైర్..!

దోషుల తరపు లాయర్ సంచలన వ్యాఖ్యలు…నిర్భయ తల్లిని శిక్షించాలి! నెటిజెన్స్ ఫైర్..!

by Anudeep

“శిక్షించాల్సింది ఆ నలుగురిని కాదు.. నిర్భయ తల్లిని శిక్షించాలి” నిర్భయ దోషుల తరపున వాదించిన ఏపి సింగ్ చేసిన వ్యాఖ్యలివి . ఆలస్యంగానైనా నిర్భయకి న్యాయం జరిగిందని నిర్భయ కుటుంబంతో పాటు, దేశమంతా సంబరపడుతుంటే న్యాయవాది సింగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఏడేళ్లుగా చట్టంలో ఉన్న లూప్ హోల్స్ అన్నింటిని వాడుకుని దోషుల్ని ఎలా అయినా రక్షించితీరుతానన్న సింగ్ చేసిన ఈ వ్యాఖ్యల అర్దమేంటో తెలుసా?

Video Advertisement

అర్దరాత్రి 12 గంటల వరకు తన కూతురు  ఎక్కుడుందో, ఎవరితో ఉందో తెలియని నిర్భయ తల్లి ఆశాదేవిని శిక్షించాలని డిమాండ్ చేశాడు సింగ్. ఈ విషయంపై సుప్రింకోర్టు బార్ అసోసియేషన్ ఆలోచించుకోవాలని సూచించాడు . అర్దరాత్రి ఆడది నిర్భయంగా తిరిగిన నాడే ఈ దేశానికి స్వాతంత్రం అని గాంధీ వ్యాఖ్యానించిన ఈ దేశంలో, ఇప్పుడు సింగ్  చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఉరిపై స్టే ఇవ్వాలన్న నిర్భయ దోషుల అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది, దీంతో సుప్రింని ఆశ్రయించారు . అక్కడ కూడా చుక్కెదురైంది.  చివరికి ఉరికంభం ఎక్కక తప్పలేదు. ఈ విషయం పై దేశం అంతా ఆనందం వ్యక్తం చేస్తుంటే ఇప్పుడు ఎపి సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.అంతేకాదు ఘటన జరిగిన నాటి నుండి ఇతగాడి వ్యాఖ్యలు ఇదే విధంగా ఉన్నాయి. ఆడపిల్లలకి అంత అర్దరాత్రి పూట రోడ్లపైన పనేంటి , ఈ కేసులో ఖచ్చితంగా తప్పు నిర్భయదే అని, ఈ నలుగురి నిందితులకి శిక్ష పడకుండా చేస్తానని మొదటి నుండి మీడియా ముందు చెప్తూ వచ్చాడు .

సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ వ్యాఖ్యలపట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అవును ఆడపిల్లలని , వారిని కన్నందుకు వారి తల్లిదండ్రులని ఉరి తీయాలని కొందరు ఎపి సింగ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తుంటే, అసలు ఆ నలుగురితో పాటు వీన్ని కూడా ఉరితీయాల్సిందని మరికొందరు తీవ్రంగా మండిపడ్డారు.

watch video:


You may also like