Ads
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును శుక్రవారం నాడు నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబునాయుడును అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఈ కేసులో చంద్రబాబును ఏ1 గా చేర్చినట్లు తెలుస్తోంది.
Video Advertisement
చంద్రబాబు నాయుడు పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన వెంటనే ఆయనను విజయవాడకు తీసుకెళ్లారు. అసలు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు అంటే ఏంటి? చంద్ర బాబు నాయుడుని ఎందుకు అరెస్ట్ చేసారు? అనేది ఇప్పుడు చూద్దాం..
స్కిల్ డెవలెప్‌మెంట్ కు సంబంధించి ఏపీలో రూ.241 కోట్ల స్కామ్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు సీమెన్స్ సంస్థ – డిజైన్‌టెక్ సంస్థలు రూ.3300 కోట్లకు ఒప్పందం చేసుకున్నాయి. దీనిలో ఏపీ ప్రభుత్వం 10శాతం నిధులు, 90 శాతం నిధులు సీమెన్స్ సంస్థ చెల్లించేలా అగ్రిమెంట్ జరిగింది. ప్రభుత్వం తరపున 10 శాతం నిధులు జీఎస్టీతో సహ రూ.370 కోట్లను చెల్లించింది. అయితే ప్రభుత్వం చెల్లించిన ఈ నిధులలో రూ.240 కోట్లు సీమెన్స్ సంస్థకు కాకుండా వేరే సంస్థకు బదలాయించారు.
చంద్రబాబు ఆర్డర్స్ తో ఈ నిధులు రిలీజ్ అయ్యాయని అభియోగం. స్కిల్‌కి సంబంధించిన పనులు జరగలేదని, ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని ఆరోపణలు. ప్రభుత్వం రిలీజ్ చేసిన రూ.371 కోట్లు విదేశాలకు వెళ్లి, సుమారు 70 షెల్ కంపెనీల ద్వారా తిరిగి దేశానికి వచ్చేయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో చంద్రబాబు పై నాన్‌బెయిలబుల్ కేసు రిజిస్టర్ చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 50(1)(2) ల కింద ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం నోటీసులు ఇచ్చింది.
అరెస్ట్‌కు సంబంధించిన పత్రాలను చంద్రబాబుకు, ఆయన లాయర్లకు ఇచ్చిన తరువాతే సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేసి, విజయవాడకు తరలించారని అంటున్నారు. చంద్రబాబు తన అరెస్టు పై స్పందిస్తూ, తాను ఎలాంటి తప్పూ చేయలేదని, ప్రజా సమస్యల పై ప్రశ్నిస్తుంటే అణిచివేస్తున్నారన్నారు. ఏ తప్పు చేశానో కూడా చెప్పకుండా అరెస్టు చేస్తున్నారని వాపోయారు.
Also Read: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఈ 12 మంది రాజకీయ నాయకుల EDUCATIONAL QUALIFICATIONS ఏంటో తెలుసా.?
End of Article