మనం ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా మనకు తెలియకుండా మన చదువు ఒక ముఖ్య పాత్ర పోషిస్తుంది అని అంటారు. అందుకే అందరూ చదువు పూర్తి అయ్యాక మాత్రమే వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ లోకి వెళ్తారు. అలా మన పొలిటిషియన్స్ కూడా చదువు పూర్తి చేశాక పోలిటిక్స్ లోకి అడుగుపెట్టారు. కొంత మంది పొలిటిషియన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 వైయస్ రాజశేఖర్ రెడ్డి

రాజశేఖర్ రెడ్డి గారు కర్ణాటకలోని గుల్బర్గాలో ఉన్న మహాదేవప్ప రాంపూర్ మెడికల్ కాలేజ్ లో ఎంబిబిఎస్ చదివారు. చదువు పూర్తి చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఉన్న జమ్మలమడుగు మిషన్ హాస్పిటల్ లో మెడికల్ ఆఫీసర్ గా చేశారు.

#2 కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

కెసిఆర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి లిటరేచర్ లో ఎం.ఏ డిగ్రీ పొందారు.

#3 నారా చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు గారు మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు.

#4 వెంకయ్య నాయుడు

వెంకయ్య నాయుడు గారు నెల్లూరులోని వి.ఆర్ కాలేజ్ లో బ్యాచిలర్ ఆఫ్ పాలిటిక్స్, డిప్లమా చేశారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుండి ఇంటర్నేషనల్ లా స్పెషలైజేషన్ తో “లా” లో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు.

#5 జయప్రకాశ్ నారాయణ్

జయప్రకాశ్ నారాయణ్ గారు గుంటూరు మెడికల్ కాలేజ్ నుండి మెడికల్ డిగ్రీ పొందారు. తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా సేవలను అందించారు.

#6 అసదుద్దీన్ ఓవైసీ

అసదుద్దీన్ ఓవైసీ నిజాం కాలేజ్ నుండి బిఏ (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్) చేశారు.

#7 పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ చేశారు.

#8 హరీష్ రావు

హరీష్ రావు హైదరాబాద్ లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ నుండి డిప్లమా చేశారు. కాకతీయ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.

#9 వైయస్ జగన్మోహన్ రెడ్డి

వైయస్ జగన్మోహన్ రెడ్డి కామర్స్ లో బాచిలర్స్ డిగ్రీ పొందారు.

#10 కేటీ రామారావు

కేటీఆర్ యూనివర్సిటీ ఆఫ్ పూణే లో బయోటెక్నాలజీలో ఎంఎస్సీ చేశారు. సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో మార్కెటింగ్ అండ్ ఈ – కామర్స్ లో ఎంబీఏ చేశారు. 1998 – 99 సమయంలో ఐటీ ప్రొఫెషనల్ గా చేశారు, ఇంకా అమెరికాలోని న్యూయార్క్ ‌లోని మాడిసన్ అవెన్యూ లోని షిప్పింగ్ అండ్ ఓషన్ లాజిస్టిక్స్ సంస్థ INTTRA ఇంక్‌ లో ఇంటర్న్ గా చేశారు.

#11 నారా లోకేష్

నారా లోకేష్ కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ స్పెషలైజేషన్ తో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంబీఏ డిగ్రీ పొందారు.

#12 కల్వకుంట్ల కవిత

కవిత విఎన్ఆర్ (VNR) విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ లో బీటెక్ చేశారు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ సదరన్ మిస్సిస్సిప్పి లో ఎమ్మెస్ చేశారు. తర్వాత యుఎస్ఎ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేశారు.

source: wikipedia