ఇటీవల ఓ మహిళా తన ఐ ఫోన్ ను రిపేర్ చేయించడానికి ఐ ఫోన్ సర్వీస్ సెంటర్ లో ఇచ్చింది. అయితే.. ఆ సర్వీస్ సెంటర్ లో పని చేస్తున్న ఇద్దరు టెక్నిషియన్స్ చేసిన తప్పుడు పని కి ఐఫోన్ సంస్థ భారీ గా నష్టపోవాల్సి వచ్చింది. ఆ సర్వీస్ సెంటర్ లో పని చేస్తున్న టెక్నిషియన్స్ ఆమె ఫోన్ లోని న్యూడ్ ఫోటోలను.. వీడియో లను సోషల్ మీడియా లో అప్ లోడ్ చేసారు.

apple pays fine

దీనితో.. ఆమె ఆగ్రహించి న్యాయపోరాటం చేసింది. ఈ క్రమం లో ఐ ఫోన్ సంస్థ ఆమెతో రాజీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం.. సదరు మహిళకు భారీ మొత్తం లో నష్టపరిహారం ఇవ్వడానికి ఆపిల్ సంస్థ అంగీకరించింది. ఆమెకు పరిహారం గా సుమారుగా 50 ల‌క్ష‌ల డాల‌ర్లు అంటే 36 కోట్ల రూపాయలను ఆపిల్ సంస్థ చెల్లించిందట.