“అర్జున్ రెడ్డి” వచ్చి 6 ఏళ్లయింది…కానీ క్లైమాక్స్ లో ఈ విషయం ఎప్పుడైనా గమనించారా?

“అర్జున్ రెడ్డి” వచ్చి 6 ఏళ్లయింది…కానీ క్లైమాక్స్ లో ఈ విషయం ఎప్పుడైనా గమనించారా?

by Sainath Gopi

Ads

గత 6 సంవత్సరాల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వచ్చాయి అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ కూడా అయ్యాయి. కానీ సెన్సేషన్ క్రియేట్ చేసినవి మాత్రం మూడు సినిమాలు. మొదటిది బాహుబలి ద బిగినింగ్, రెండవది బాహుబలి ద కంక్లూషన్, మూడవది అర్జున్ రెడ్డి.

Video Advertisement

బాహుబలి 2 భాగాలు తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో గర్వపడేలా చేస్తే, అర్జున్ రెడ్డి సినిమా అప్పటివరకు తెలుగు సినిమాల్లో ఫాలో అయిన ఎన్నో రూల్స్ ని బ్రేక్ చేసింది. తమ కథని ధైర్యంగా ప్రజెంట్ చేయడానికి ఎంతో మంది డైరెక్టర్లకు స్ఫూర్తినిచ్చింది.

సినిమా రిలీజ్ అయినప్పుడు మనలో ఎంతమంది అసలు సినిమా ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఎదురు చూసిన వాళ్లు ఉండే ఉంటారు. ఆగస్టు 25వ తేదీ తో అర్జున్ రెడ్డి విడుదల అయ్యి నాలుగు సంవత్సరాలు అయింది.

గతంలో ఓ ఇంటర్వ్యూ లో క్రిటిక్ భరద్వాజ్ రంగన్ తో సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఎన్నో విషయాలు చెప్పారు. ఈ సినిమా కట్ లేకుండా ఫైనల్ వెర్షన్ చూస్తే దాదాపు 4 గంటల పైనే వచ్చిందని, అది చూసి ఇంత చెత్త సినిమా తీశాను నేను అని అనుకున్నారట సందీప్ రెడ్డి. తర్వాత ఇంకొక వర్షన్ మూడు గంటలకి పైగా వచ్చిందట. అర్జున్ రెడ్డి విడుదల అయ్యి ఐదు సంవత్సరాలు పూర్తి అయినప్పుడు ఆ ఫైనల్ వెర్షన్ విడుదల చేస్తారట.

అంతేకాకుండా ఈ సినిమా గురించి ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు సందీప్ రెడ్డి. సినిమా స్టార్టింగ్ లో అర్జున్ రెడ్డి నాయనమ్మ పాత్ర పోషించిన సీనియర్ నటి కాంచనమాల వేసుకునే కాస్ట్యూమ్, ఇంకా సినిమా ఎండింగ్ లో ప్రీతి పాత్ర పోషించిన షాలిని పాండే వేసుకునే డ్రెస్ సేమ్ పాటర్న్ లో ఉంటాయట.

ఇది ఇలా చూపించడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే అర్జున్ రెడ్డి జీవితంలో ఇద్దరు ఆడవాళ్లు ముఖ్య పాత్ర పోషించారు. వాళ్ళిద్దరి ఇంపార్టెన్స్ చూపించడానికి సందీప్ రెడ్డి వంగా ఇలా ఆలోచించారట.

ఈ సినిమా పెళ్లిచూపులు తర్వాత మొదలైంది. కానీ షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడిన టెడ్ టాక్స్ యూట్యూబ్ లో ఉంది. ఆ వీడియో ఒకసారి చూస్తే ఎన్ని కష్టాలతో ఈ సినిమా బయటికి వచ్చిందో మీకే అర్థమవుతుంది.

అర్జున్ రెడ్డి సినిమా తో విజయ్ దేవరకొండ మాత్రమే కాకుండా హీరోయిన్ గా నటించిన షాలిని పాండే, హీరో ఫ్రెండ్ శివ పాత్రలో నటించిన రాహుల్ రామకృష్ణ కూడా మంచి గుర్తింపును పొందారు. అర్జున్ రెడ్డి సినిమా లో హీరో గా ముందు శర్వానంద్ ని అనుకున్నారట.

కారణం తెలియదు కానీ ఈ సినిమా శర్వానంద్ రిజెక్ట్ చేశారని వార్తలు వచ్చాయి. అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ కోసం లోకేషన్స్ సెలెక్ట్ చేయడానికి 4 నెలల సమయం పట్టిందట. సినిమా తీసేంత వరకు ఒక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటే, సినిమా తీసిన తర్వాత విడుదల సమయంలో ఇంకొక రకమైన సమస్యలు ఎదుర్కొన్నారు.

సోషల్ మీడియాలో, న్యూస్ చానల్స్ లో ఎక్కడ చూసినా కూడా అర్జున్ రెడ్డి సినిమా గురించి రోజుకి ఒక్క నెగిటివ్ కామెంట్ అయినా వచ్చేది. సినిమా విడుదలయ్యే సమయంలో ఎంత క్రేజ్ వచ్చిందో, అంతే కాంట్రవర్సీస్ కూడా వచ్చాయి. అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన తర్వాత తెలుగు ఇండస్ట్రీ నుంచి మాత్రమే కాకుండా ఇతర భాషలకి చెందిన సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా అర్జున్ రెడ్డి సినిమాని ప్రశంసించారు.

ఇప్పటికే అర్జున్ రెడ్డి హిందీలో కబీర్ సింగ్ గా, తమిళ్ లో ఆదిత్య వర్మ గా రీమేక్ అయింది. రెండు రీమేక్స్ కూడా విజయాలను సాధించాయి. అర్జున్ రెడ్డి సినిమా కి విజయ్ దేవరకొండ ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు. కానీ విజయ్ ఆ అవార్డు తీసుకొని, ఆక్షన్ వేసి, వచ్చిన డబ్బులను చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి అందజేశారు.

watch video:

 


End of Article

You may also like