అర్జున్ తన కూతురి పెళ్ళికి ఇంత కట్నం ఇచ్చారా..? బహుమతులు కూడా..?

అర్జున్ తన కూతురి పెళ్ళికి ఇంత కట్నం ఇచ్చారా..? బహుమతులు కూడా..?

by Harika

Ads

ప్రముఖ నటుడు అర్జున్ సర్జా కూతురి పెళ్లి ఇటీవల ఘనంగా జరిగింది. ఎంతో మంది ప్రముఖులు వీరి పెళ్లికి హాజరు అయ్యారు. అర్జున్ కూతురు పేరు ఐశ్వర్య. ఐశ్వర్య, అర్జున్ పెద్ద కూతురు. ఐశ్వర్య కూడా తమిళ్ లో కొన్ని సినిమాల్లో నటించారు. ఐశ్వర్య పెళ్లి చేసుకున్న వ్యక్తి పేరు ఉమాపతి రామయ్య. ఉమాపతి రామయ్య తండ్రి కూడా చాలా పెద్ద నటుడు. ఆయన పేరు తంబి రామయ్య. ఎన్నో సినిమాల్లో తంబి రామయ్య ముఖ్య పాత్రల్లో నటించారు. వీరిద్దరి పెళ్లి ఇటీవల చెన్నైలో జరిగింది. ఈ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Video Advertisement

arjun sarja gift his daughter

అయితే, అర్జున్ తన కూతురికి కట్నంగా ఇచ్చిన బహుమతులు విషయం బయటకు వచ్చింది. అర్జున్ తన కూతురికి ఒక విలాసవంతమైన బంగ్లాతో పాటు, కొన్ని కోట్ల రూపాయలని కట్నంగా ఇచ్చినట్టు సమాచారం. బంగ్లా విలువ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అని అంటున్నారు. అర్జున్ కి ఇద్దరు కూతుళ్లు. కాబట్టి తను సంపాదించింది అంతా కూడా వారిద్దరికే కాబట్టి ఇలాంటి కానుకలు ఇచ్చారు అని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. ఐశ్వర్య అర్జున్ 2013 లో విశాల్ హీరోగా నటించిన పట్టత్తు యానై అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు.

ఆ తర్వాత 2018 లో ప్రేమ బరాహ అనే కన్నడ సినిమాలో నటించారు. ఆ తర్వాత తెలుగులో ఒక సినిమాలో నటించాల్సి ఉన్నా కూడా ఆ సినిమా షూట్ మొదలు అవ్వకముందే ఆగిపోయింది. మరొక పక్క ఉమాపతి రామయ్య కూడా నటుడే. కొన్ని తమిళ్ సినిమాల్లో నటించారు. అలాగే జీ తమిళ్ లో నిర్వహించిన సర్వైవర్ అనే రియాలిటీ షోలో కూడా పాల్గొన్నారు. టాప్ ఫోర్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచారు. అర్జున్ కూడా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా, ముఖ్య పాత్రల్లో కూడా అర్జున్ నటిస్తున్నారు. ఇటీవల అర్జున్ లియో సినిమాలో నటించారు. అంతే కాకుండా అజిత్ హీరోగా నటిస్తున్న విడా ముయార్చి సినిమాలో కూడా అర్జున్ నటిస్తున్నారు.


End of Article

You may also like