Ads
- చిత్రం : అర్జున ఫల్గుణ
- నటీనటులు : శ్రీ విష్ణు, అమృత అయ్యర్.
- నిర్మాత : కళ్యాణ్ కృష్ణ
- దర్శకత్వం : తేజ మార్ని
- సంగీతం : ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్
- విడుదల తేదీ : డిసెంబర్ 31, 2021
Video Advertisement
స్టోరీ :
సినిమా గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుంది. అర్జున (శ్రీ విష్ణు) ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. స్నేహితులకి ఏదైనా సహాయం కావాలంటే చెయ్యడానికి ముందుంటాడు. అలాంటిది ఒక సారి అర్జున ప్రమాదంలో పడతాడు. తన స్నేహితులతో కలిసి అరకుకి మత్తు పదార్ధం సరాఫరా చేయాలి అని ప్లాన్ వేసుకుంటారు. ఈ క్రమంలో పోలీసుల నుండి వారు ఎలా తప్పించుకుంటారు? వాళ్ళు అనుకున్నది చేసారా? ఇదంత తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
సినిమా చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. అర్జున ఫల్గుణ అనే పదం వెనకాల ఉన్న అర్థం చెప్పడానికి ప్రయత్నించారు. జోక్స్ కూడా కొన్ని బాగానే వర్కౌట్ అయ్యాయి. గోదావరి నేటివిటీ బాగా చూపించారు. అలాగే సినిమాలో నటించిన నటులు కూడా గోదావరి యాసలో చాలా బాగా మాట్లాడారు. ఒక పాయింట్ వరకు సరదాగా సాగిన సినిమా తర్వాత క్రైమ్ థ్రిల్లర్ గా మారిపోతుంది. కానీ కథ చాలా స్లోగా ఉండడం వల్ల సినిమా ముందుకు వెళుతున్న కొద్దీ బోరింగ్ గా అనిపిస్తుంది. మధ్యలో మళ్లీ సినిమా కొంచెం బాగా నడుస్తోంది అనిపించే సమయంలోనే మళ్ళీ స్లో అయిపోతుంది.
పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే శ్రీ విష్ణు తన పాత్రకి సూట్ అయ్యారు. ఇప్పటివరకు శ్రీ విష్ణుని మనం అలాంటి పాత్రల్లో చూసి ఉండం. మిగిలిన నటీనటులు కూడా బాగానే నటించారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ప్రియదర్శన్ అందించిన పాటలు అందులోనూ ముఖ్యంగా గోదారి వల్లే సందమామ అనే పాట కూడా చాలా బాగుంది. ఇవన్నీ బాగున్నా కూడా, ప్రేక్షకులకి ఆసక్తి కలిగించే కొత్త పాయింట్ కానీ, లేదా ఉన్న కథను బాగా చూపించే టేకింగ్ కానీ ఏది సినిమాలో లేదు.
ప్లస్ పాయింట్స్ :
- శ్రీ విష్ణు
- పాటలు
మైనస్ పాయింట్స్:
- బోరింగ్ గా ఉండే సీన్స్
- బలహీనమైన కథ
రేటింగ్ :
2/5
ట్యాగ్ లైన్ :
అర్జున ఫల్గుణ థియేటర్లలో కాకుండా డిజిటల్ రిలీజ్ అయ్యి ఉంటే సినిమా ఫలితం యావరేజ్ గా ఉండేది.
End of Article