బిగ్‌బాస్‌-6 కంటెస్టెంట్ “ఆరోహి రావు” గురించి ఈ విషయాలు తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

బిగ్‌బాస్‌-6 కంటెస్టెంట్ “ఆరోహి రావు” గురించి ఈ విషయాలు తెలుసా..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by Anudeep

విభిన్నమైన కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది బిగ్ బాస్ రియాలిటీ షో. ఇప్పటికే అయిదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొని తాజాగా ఆరో సీజన్ ను ప్రారంభించింది. సెప్టెంబర్ 4 ఆదివారం రోజున గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 6 ను ప్రారంభించారు.

Video Advertisement

ఒక్కొరిగా కంటెస్టెంట్ లను హౌస్ లోకి పంపుతున్నారు హోస్ట్ నాగార్జున. ఇందులో భాగంగా హౌస్ లోకి ఎంటర్ అయ్యారు ప్రముఖ యాంకర్ ఆరోహి రావు. ఆమె వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ కు చెందిన ఆరోహి అలియాస్ అంజలి చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంది. చిన్నప్పటి నుంచే కష్టాలే కేర్ అఫ్ అడ్రస్ గా పెరిగానని ఆమె చెప్పుకొచ్చింది.

who is aarohi rao in bigboss 6..
అనారోగ్యం తో తల్లి చనిపోగా తండ్రి మరో వివాహం చేసుకొని తనను వదిలేసాడని ఆమె తెలిపారు. దీంతో అమ్మమ్మ దగ్గరే ఆరోహి పెరిగారు. యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆరోహి రావు షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకుంది. టీవీ 9 లో వచ్చే ఇస్మార్ట్ న్యూస్ తో పాపులారిటీ తెచ్చుకుంది ఆరోహి. పల్లెటూరి నుంచి హైదరాబాద్ కు వచ్చిన తానూ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు. సాయం చేస్తా అంటూనే ఇంకేదో పొందాలనుకునే వారి నుంచి తనను తానూ రక్షించుకొనేందుకు ఎంతో మారానని తెలిపారు.

who is aarohi rao in bigboss 6..
ఆ క్రమం లోనే అమాయకపు అంజలి నుంచి ఆత్మవిశ్వాసం ఉన్న ఆరోహిగా మారానని ఆమె బిగ్ బాస్ లోకి వెళ్లేముందు చెప్పుకొచ్చారు. సీజన్ 6 లో 20 వ కంటెస్టెంట్ గా ఎంటర్ అయిన ఆమె బిగ్ బాస్ కు వెళ్లడం ద్వారా తానేంటో అందరికి నిరూపించుకొని గుర్తింపు తెచ్చుకుంటానని తెలిపారు. హౌస్లో ఉన్న సెలెబ్రెటీలు ఇప్పటికే ప్రజలకు తెలుసు. అందుకే నేనేంటో ప్రజలకు నిరూపించుకునేందుకు బిగ్ బాస్ కు వచ్చానని ఆమె హోస్ట్ నాగార్జునకు చెప్పుకొచ్చారు. ఇప్పటికే టీవీ 9 ఛానల్ నుంచి దేవి నాగవల్లి గతం లో బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యారు. తాజాగా అదే ఛానెల్ నుంచి మరో యాంకర్ బిగ్ బాస్ లో అలరించనున్నారు.


You may also like