Arthamayyindha Arun Kumar : “ఆహా” లో రిలీజ్ అయిన ఈ సిరీస్ అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Arthamayyindha Arun Kumar : “ఆహా” లో రిలీజ్ అయిన ఈ సిరీస్ అలరించిందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by kavitha

Ads

తెలుగు ఓటీటీ అనగానే వెంటనే గుర్తొచ్చేది ‘ఆహా’. మిగతా వాటిల్లో అప్పుడప్పుడు తెలుగు సినిమాలు, సిరీసులు వస్తుంటాయి. అయితే ఆహాలో ప్రతివారం ఒక మూవీ లేదా వెబ్ సిరీస్ ను విడుదల చేస్తుంటారు. తాజాగా  ‘అర్ధమయ్యిందా అరుణ్ కుమార్’ వెబ్‌ సిరీస్ ను రిలీజ్ చేశారు. ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • వెబ్ సిరీస్ : అర్ధమయ్యిందా అరుణ్ కుమార్
  • నటీనటులు : హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మదివాడ, వాసు ఇంటూరి, జై ప్రవీణ్, అభినవ్ గోమఠం తదితరులు
  • దర్శకత్వం : జొనాథన్ ఎడ్వర్డ్స్,
  • ఛాయాగ్రహణం : అమర్ దీప్ గుత్తుల
  • సంగీతం : అజయ్ అరసాడ
  • ఓటీటీ వేదిక : ఆహా
  • ఎపిసోడ్స్ : 5
  • విడుదల తేదీ: 30 జూన్ 2023

స్టోరీ:

అరుణ్ కుమార్ (హర్షిత్ రెడ్డి) అనే యువకుడిది అమలాపురం. అతని కల కార్పొరేట్ కంపెనీలో జాబ్ సాధించడం. దానిని నెరవేర్చుకోవడం కోసం హైదరాబాద్‌కి వస్తాడు. అతనికి ఒక స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం దొరుకుతుంది. అయితే అతని టీమ్ లీడర్ జై అరుణ్‌ని బానిసలా ట్రీట్ చేస్తుంటాడు.Ardhamaindha-Arun-Kumar-Review-2అయితే అదే కంపెనీలో పని చేస్తున్న షాలినీ(తేజస్వి మదివాడ) టీమ్‌లో పని చేసే ఛాన్స్ వస్తుంది. దాంతో ఆమె దగ్గర కొద్ది రోజుల్లోనే మంచి మార్కులు తెచ్చుకుంటాడు. దాంతో ఇద్దరి మధ్య పర్సనల్ రిలేషన్‌ ఏర్పడుతుంది. ఆ తరువాత ఏం అయ్యింది? దీనిలో పల్లవి (అనన్య) క్యారెక్టర్ ఏమిటి? చివరికి ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే..రివ్యూ:

2016లో హిందీలో రూపొందిన ‘అఫీషియల్ చుక్యాగిరి’ వెబ్ సిరీస్‌కు అఫిషియల్ రీమేక్ గా ‘అర్ధమయ్యిందా అరుణ్ కుమార్’ తెరకెక్కింది. కార్పోరేట్ ఆఫీసుల్లో ఇంటర్న్ గా జాయిన్ అయ్యేవారిని ఎలా చూస్తారనే కాన్సెప్టుతో రూపొందింది. లైఫ్ లో ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలనే కలతో హైదరాబాద్ వచ్చిన అరుణ్ కుమార్ బ్యాచిలర్ రూమ్‌లో ఉంటాడు.ఆఫీస్ కి వెళ్ళిన దగ్గర నుండి టీలు చేసే వర్క్ ఇస్తారు. కార‍్పొరేట్ ప్రపంచంలో ఒక పల్లెటూరి కుర్రాడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర‍్కొన్నాడు? పనిలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? ఆఖరికి తన లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా అనే విషయాన్ని 5 ఎపిసోడ్లలో చూపించారు.
హర్షిత్ రెడ్డి అరుణ్ కుమార్ ఇంటర్న్ పాత్రలో ఒదిగిపోయాడు. అమాయకంగా కనిపిస్తూ, ఆఫీస్ లో చెప్పిన పనులన్ని చేస్తూ మెప్పించాడు. అతని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంది. డామినేషన్, స్వార్ధం కలిగిన టీమ్ లీడర్ షాలినీ క్యారెక్టర్ లో తేజస్వి పర్వాలేదనిపించింది. పల్లవిగా అనన్య ఒకే. ఆఫీస్ బాయ్ పాత్రలో వాసు ఇంటూరి నవ్వించేందుకు ట్రై చేశారు. మిగతా వాళ్ళు తమ పాత్రల మేరకు నటించారు.ప్లస్ పాయింట్స్:

  • హర్షిత్ రెడ్డి నటన,
  • లవ్ ట్రాక్,
  • డైలాగ్స్

మైనస్ పాయింట్లు:

  • రొటీన్ స్టోరి
  • లోపించిన ఎమోషన్స్
    రేటింగ్:

3/5

టాగ్ లైన్ :

అర్ధమయ్యిందా అరుణ్‌కుమార్ మంచి టైమ్‌పాస్ ఎంట‌ర్‌టైన‌ర్..

watch trailer :


Also Read:మెగా ప్రిన్సెస్‌ కు రిలయెన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఖరీదైన గిఫ్ట్‌..! ఏమిటో తెలుసా..?


End of Article

You may also like