నటి శైలజా ప్రియ రియల్ లైఫ్ గురించి ఈ ఆశ్చర్యకర విషయాలు తెలుసా.?

నటి శైలజా ప్రియ రియల్ లైఫ్ గురించి ఈ ఆశ్చర్యకర విషయాలు తెలుసా.?

by Mohana Priya

Ads

ఎన్నో సినిమాలు, సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియ. ప్రియ పూర్తి పేరు మామిళ్ల శైలజా ప్రియ. 42 ఏళ్ల ప్రియ, 20 మే 1978 లో, బాపట్లలో పుట్టారు. తన తల్లిదండ్రులు శ్రీ మామిళ్ళ వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి మామిళ్ల కుసుమ కుమారి గారు. ముగ్గురు అక్కా చెల్లెళ్లలో ప్రియ మూడవ వారు. ప్రియ స్కూలింగ్ అంతా హైదరాబాద్ లోనే జరిగింది. కాలేజ్ లో ఉన్నప్పుడు మిస్ కాలేజ్ టైటిల్ గెలుచుకున్నారు ప్రియ. తర్వాత నటనా రంగంలోకి అడుగు పెట్టారు. ప్రియ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ చేశారు.

Video Advertisement

జెమినీ టీవీలో టెలికాస్ట్ అయిన ప్రియసఖి సీరియల్ తో సీరియల్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ప్రియ. ఈ సీరియల్ అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. తర్వాత ప్రియా ఓ ప్రియా, సంఘర్షణ, లేడీ డిటెక్టివ్, మిసెస్ శారద, జ్వాల, కొత్త బంగారం ఇంకా ఎన్నో సీరియల్స్ లో నటించారు. తమిళ్ లో కూడా నాగమ్మ, వాణి – రాణి సీరియల్స్ తో పాటు మరికొన్ని సీరియల్స్ చేశారు. హిందీలో యే హై జిందగీ అనే సీరియల్ లో యాక్ట్ చేశారు ప్రియ.

అలాగే మాస్టర్, దొంగాట, గోకులంలో సీత, మావిడాకులు, సీతారాముల కళ్యాణం చూతము రారండి, సూర్యుడు, సుప్రభాతం, రాజకుమారుడు, అన్నయ్య, జయం మనదేరా, చిరునవ్వుతో, ఢమరుకం, కత్తి కాంతారావు, మిర్చి, ఇద్దరమ్మాయిలతో పిల్లా నువ్వు లేని జీవితం, సన్నాఫ్ సత్యమూర్తి, పండగ చేస్కో , విన్నర్, బాబు బంగారం, రారండోయ్ వేడుక చూద్దాం ఇలా ఎన్నో సినిమాల్లో నటించారు.

నటించడం మాత్రమే కాకుండా కొన్ని ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ కూడా చేశారు ప్రియ. కెరీర్ ప్రారంభించిన కొంత కాలంలోనే నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత దాసరి కల్చరల్ అవార్డ్, స్వాతి కల్చరల్ అవార్డ్, లాంటి ఎన్నో అవార్డులు అందుకున్నారు.

కొత్త బంగారం సీరియల్ లో భువనేశ్వరి పాత్రకి జెమినీ ఉగాది పురస్కారం అందుకున్నారు. 2002లో ప్రియకి, ఎంవిఎస్ కిషోర్ తో పెళ్లి జరిగింది. 2003 లో వాళ్లకి ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పేరు నిశ్చయ్. ప్రియ ఇలాగే మరిన్ని మంచి పాత్రలతో మనల్ని అలరించాలని ఆశిద్దాం.

Who Will Win Bigg Boss 5 Telugu? (బిగ్ బాస్ 5 తెలుగు విజేత ఎవరి అని అనుకుంటున్నారు ?)

vote for your favorite Bigg Boss 5 Telugu contestant  ( మీకు నచ్చిన బిగ్ బాస్ 5 తెలుగు కంటెస్టెంట్ కి ఇక్కడ ఓటు వేయండి )


End of Article

You may also like