కేవలం రెండు నిమిషాలే అంటే నేను చేయను…సీనియర్ నటి సంచలన కామెంట్స్! ఆ హీరో ఫాన్స్ ఫైర్..!

కేవలం రెండు నిమిషాలే అంటే నేను చేయను…సీనియర్ నటి సంచలన కామెంట్స్! ఆ హీరో ఫాన్స్ ఫైర్..!

by Anudeep

Ads

క్యారెక్టర్ ఆర్టిస్టు సుధ పరిచయం అక్కర్లేని పేరు . అమ్మ, అక్కా, వదిన ఇలా ఏ పాత్ర అయిన ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయే నటి. సీనియర్ యాక్టర్స్ చిరు, నాగార్జున, వెంకటేష్,మోహన్ బాబు లతో పాటు నేటి తరం యాక్టర్స్ బన్ని, చైతూ,ఎన్టీయార్ అందరితో నటించిన అనుభవం సుధ ది. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్తో మాట్లాడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పరు.

Video Advertisement

రామ్ చరణ్, మనోజ్, అల్లు అర్జున్, అల్లరి నరేష్ ఇలా అందర్నీ చిన్నప్పటి నుంచి చూశానని, వారంతా తనతో ఎంతో ప్రేమగా ఉంటారని చెప్పింది. ఝుమ్మంది నాదం సినిమా సమయంలో మమ్మీ అంటూ మనోజ్ గట్టిగా అరిచాడని తెలిపింది. మేజర్ చంద్రకాంత్ సమయం నుంచి మనోజ్ తనను మమ్మీ అనే పిలుస్తాడని చెప్పుకొచ్చింది. మేజర్ చంద్రకాంత్ సినిమాలో మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు . అదే చిత్రంలో సుధ మోహన్ బాబు అక్కగా నటించారు.

చిరంజీవితో సుధ ప్రయాణం గ్యాంగ్ లీడర్ సినిమా కంటే ముందు నుండి ఉంది . ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో అనేక సినిమాల్లో సుధ నటించారు. వాటిల్లో ఆమెలో సుధ పోషించిన పాత్రకి అభినందించకుండా ఉండలేం, కోడల్ని హింసిస్తున్న భర్త కోటాశ్రీనివాసరావుని చంపే సీన్లో సుధలోని మరోయాంగిల్ నటన చూడొచ్చు. అప్పటి వరకు సౌమ్యమైన పాత్రలు పోషించిన సుధ , ఆ పాత్రతో తనలోని రౌద్రాన్ని చూడొచ్చు.

చిరంజీవి, నాగార్జున, బాలయ్యతో చాలా క్లోజ్ అని వారితో చాలా సినిమాలు చేయడంతో వారి కుటుంబాలతో కూడా కలిసి పోయాయని చెప్పుకొచ్చింది. అందరి కంటే నాగార్జున ఫ్యామిలీతోనే తనకు ఎక్కువ అనుబంధం అని తెలిపింది. నాగార్జున అక్క సుశీల,  అన్నయ్య అక్కినేని వెంకట్ బాగా తెలుసని, సుశీలతో ఫోన్‌లో చాలా సేపు ఫోన్ మాట్లాడతుంటానని పేర్కొంది.

వీటన్నింటితో పాటు శ్రీమంతుడు సినిమాలో వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చింది అనే విషయాన్ని శేర్ చేసుకున్నారు.తాను ఓ క్యారెక్టర్ చేస్తే అందరూ గుర్తించాలని, అందరికి గుర్తుండిపోయే పాత్రలే చేస్తానని చెప్పుకొచ్చింది. తన పాత్ర నచ్చకపోతే ఆ క్యారెక్టర్ చేయనని ఖరాఖండిగా చెప్పేసింది. అందులో భాగంగానే శ్రీమంతుడు సినిమాను వదులుకున్నానని కూడా తెలిపింది.

శ్రీమంతుడు సినిమాలో తన పాత్ర రెండు రోజులే షూటింగ్,పాత్ర నిడివి రెండు నిమిషాలే ఉంటుందని చెప్పారు. అలాంటప్పుడు తానెందుక ఆ పాత్ర చేయాలని, అందుకే వదులుకున్నట్లు పేర్కొంది. మనసు చంపుకుని తాను ఏ పాత్ర చేసినా అది ప్రజలు గుర్తించే విధంగా ఉండాలనే కోరుకుంటానని తెలిపింది. ఊరికే దిష్టిబొమ్మలా నిల్చునే పాత్రలు తాను ఒప్పుకోనని స్పష్టం చేసింది.

సుధ చేసిన కామెంట్స్ పట్ల కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అయితే మరికొందరు మహేష్ బాబు ఫాన్స్ మాత్రం నెగటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడంటే అవకాశాలున్నాయి కాబట్టి, ఇంత తలపొగరుగా మాట్లాడుతున్నావ్ లేకపోతే ఏ పాత్ర వస్తే ఆ పాత్ర చేసేదానివి అని కొందరు కామెంట్ చేస్తే , ఏ పాత్ర చేయాలి, ఏది చేయకూడదు అనేది ఆమె ఇష్టం అని మరికొందరు సుధకి సపోర్ట్గా కామెంట్ చేస్తున్నారు.

image source: 1 , 2 , 3 , 4 , 5 , 6


End of Article

You may also like