Ads
లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అంటే మనకు గుర్తొచ్చేది కొన్ని సినిమాల్లో కచ్చితంగా ఉండే సినిమా అరుంధతి. ఈ సినిమా అనుష్కకి స్టార్ స్టేటస్ తీసుకురావడంతో పాటు, మళ్లీ లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఎంతో మంది హీరోయిన్స్ కి ప్రోత్సాహం ఇచ్చింది. ఈ సినిమాకి కోడి రామకృష్ణ గారు దర్శకత్వం వహించగా, శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిర్మించారు.
Video Advertisement
అరుంధతి తర్వాత అనుష్క ఎన్నో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించారు. వాటిలో చాలా సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు.అరుంధతి సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకి అనుష్క ఎన్నో అవార్డులను అందుకున్నారు. సినిమా గ్రాఫిక్స్ కి కూడా చాలా పాపులర్ అయ్యింది.
అయితే అరుంధతి సినిమాలో అరుంధతి పాత్ర పోషించిన అనుష్క తండ్రిగా నటించిన నటులు మనకి గుర్తు ఉండే ఉంటారు. ఆయన శంకర్. శంకర్ గారు అంతకుముందు కూడా ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో నటించారు. ముఖ్యంగా టెలివిజన్ రంగానికి అయితే శంకర్ గారు చాలా సుపరిచితులు. శంకర్ గారి కొడుకులు కూడా ఇండస్ట్రీ లోనే ఉన్నారు.
వాళ్లే బాలాదిత్య, కృష్ణ కౌశిక్. వీళ్లిద్దరు కూడా చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటిస్తున్నారు. కృష్ణ కౌశిక్ ఎన్నో సినిమాలతో పాటు ఎన్నో సీరియల్స్ లో కూడా నటించారు. బాలాదిత్య కూడా ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా, అలాగే హీరోగా కూడా నటించారు. బాలాదిత్య ప్రస్తుతం స్టార్ మా లో టెలికాస్ట్ అవుతున్న సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ లో బాలరాజు గా నటిస్తున్నారు. అలాగే కృష్ణ కౌశిక్ కూడా సీరియల్స్ లో నటిస్తున్నారు.
End of Article