“అరుంధతి” లో చిన్నప్పటి జేజమ్మ ఇప్పుడు హీరోయిన్ అయ్యిందని తెలుసా..ఎలా ఉందో చూడండి..!

“అరుంధతి” లో చిన్నప్పటి జేజమ్మ ఇప్పుడు హీరోయిన్ అయ్యిందని తెలుసా..ఎలా ఉందో చూడండి..!

by Anudeep

అరుంధతి సినిమాలో చారడేసి కళ్ళేసుకుని, పరికిణి తో..హుందాగా అలంకరించుకుని మెట్ల పైనుంచి ఠీవి గా నడుచుకుంటూ వస్తున్న అమ్మాయి గుర్తుందా..? అనుష్క చిన్ననాటి క్యారెక్టర్ ను పోషించిన ఆ అమ్మాయి పేరు దివ్య నగేశ్.

Video Advertisement

ఈ సినిమా లో ఆమె నటన, హావ భావాలు హై లైట్ గా నిలిచాయి. అరుంధతి ఎంత బిగ్గెస్ట్ హిట్ అయిందో.. ఈ పాప కు కూడా అంతే మంచి పేరు వచ్చింది.

కానీ, ఈ సినిమా తరువాత ఆమె తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. వాస్తవానికి దివ్య నగేశ్ కేరళ నటి. ఆమె అనేక మలయాళ సినిమాలలో బాల నటి గా నటించిందట. అసలు సినిమాల్లోకి రాకముందే, దివ్య నగేశ్ 150 కి పైగా అడ్వర్టైజ్మెంట్ లలో నటించిందట. ఆ తరువాత బాల నటి గా చేసి మధ్యలో కొంత కాలం ఏమి సినిమాలు చేయలేదట. మలయాళం లో నే కొన్ని సినిమాలలో హీరోయిన్ గా చేసిందట. తెలుగు లో కూడా నేను నాన్న, అబద్ధం అనే రెండు సినిమాల్లో దివ్య నగేశ్ హీరోయిన్ గా నటించింది.

divya nagesh 1

మలయాళం, తెలుగే కాదు.. ఆమెకు తమిళనాట కూడా మంచి పాపులారిటీ ఉన్నట్లు ఉంది. ప్రస్తుతం ఆమె బాల, శంకర్ వంటి టాప్ దర్శకులతో పని చేస్తోందట. ఆమె ఇది వరకే నటించిన దేడినన్ అనే సినిమా కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసేసుకుని రిలీజ్ అవడానికి రెడీ గా ఉంది.

తాజాగా ఆమె తీయించుకున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే, అవకాశాలు లేకే ఆమె ఇలా ఫోటోలు దిగుతోందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరో వైపు కరోనా కారణం గానే తనకు అవకాశాలు తగ్గాయని చెబుతూ, నెటిజెన్ల విమర్శలనేమి ఆమె పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం, తమిళనాట బిజీ గా ఉన్న దివ్య నగేశ్ అవకాశాలు వస్తే తెలుగు లో చేయడానికి కూడా సిద్ధం గా ఉందట.

#

#

# # # #

 


You may also like