Ads
సినిమాలు అన్న తర్వాత ఎక్కువ శాతం హీరోలకి ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు మాత్రమే వస్తాయి. కొన్ని సినిమాలు మాత్రమే హీరోయిన్లకి ప్రాధాన్యత ఇచ్చే సినిమాలు వస్తాయి. అలా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా కథ బాగున్న సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. అలా వచ్చిన సినిమాలు మాత్రం హిట్ అవుతాయి. అలాంటి ఒక సినిమా ఇది. అసలు ఈ సినిమా విడుదల అయ్యేంతవరకు కూడా సినిమా గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఒకసారి సినిమా బయటికి వచ్చాక సినిమా గురించి అందరూ మాట్లాడుకున్నారు. ఈ సినిమా పేరు అరువి.
Video Advertisement
అరుణ్ ప్రభు పురుషోత్తమన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదితి బాలన్ హీరోయిన్ గా నటించారు. ఇది హీరోయిన్ గా ఆమె మొదటి సినిమా. కానీ సినిమా చూస్తే, అందులో ఆమె నటన చూశాక ఇది ఆమె మొదటి సినిమా అని అనిపించదు. ఈ సినిమాలో అరువి అనే పాత్రలోనే ఆమె నటించారు. ఎస్ ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు ఈ సినిమాని నిర్మించారు. బిందు మాలిని వేదాంత్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. అరువి, తన స్నేహితురాలు ఎమిలీ (అంజలి వర్ధన్) ఇంటరాగేషన్ సీన్ తో సినిమా మొదలవుతుంది. వాళ్ళిద్దరిని మొహమ్మద్ షకీల్ వకాబ్ (మహమ్మద్ అలీ బేగ్) ఇంటరాగేషన్ చేస్తూ ఉంటాడు. అసలు వీళ్ళు ఇద్దరు ఎవరు అనేది కథ. సినిమా ఒక ఫీల్ గుడ్ సినిమా లాగా మొదలవుతుంది.
కానీ సినిమా ముందుకి వెళ్తున్న కొద్ది అసలు సమాజంలో ఆడవారు ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటారు అనేది ఈ సినిమాలో చూపించారు. ఒక అమ్మాయికి ఒక సమస్య వస్తే, తన కుటుంబమే అమ్మాయిని ఎలా చూస్తారు అనేది కూడా ఈ సినిమాలో చూపించారు. సెకండ్ హాఫ్ కంటతడి పెట్టిస్తుంది. క్లైమాక్స్ లో అరువి పడే ఇబ్బందులు చూస్తే చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. 2017 లో వచ్చిన ఈ సినిమా ఎంతో మంది ప్రశంసలను, ఎన్నో అవార్డులను అందుకుంది. సినిమా తమిళ్ లో తీసినా కూడా తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. దాంతో ఈ సినిమా చూసిన తెలుగు వారు కూడా ప్రశంసిస్తున్నారు.
End of Article