Ads
టాలీవుడ్ లో విలన్ పాత్రలతో పేరు సంపాదించిన ఆశిష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో మరోసారి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మే 25 అస్సాంకు చెందిన రూపాలీ బారువాతో ఏడడుగులు నడిచాడు. ఒకప్పటి నటి అయిన శకుంతల బారువా కూతురు రాజోషి బారువా అతని మొదటి భార్య. వారికి గతేడాది విడాకులు జరిగాయి.
Video Advertisement
అయితే 60 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి చేసుకోవడం ఏంటి.. అంటూ ఆశిష్ విద్యార్ధిపై ఘోరంగా ట్రోల్ చేశారు. ఇక తాజాగా ఈ ట్రోలింగ్ పై స్పందించాడాయన. ఆశిష్ విద్యార్ధి మాట్లాడుతూ.. ” నేను రెండో పెళ్లి చేసుకోవడం తో ముసలోడు, సభ్యత సంస్కారం లేనివాడు వంటి అసభ్యకరమైన పదాలతో నన్ను ట్రోల్ చేశారు. జీవితాన్ని సంతోషంగా ముగించాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు..ఓ తోడు కావాలని కోరుకుంటారు. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని అందుకే చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాను.
ఇప్పటికీ కష్టపడి పనిచేస్తున్నాను, పన్నులు కూడా కడుతున్నాను. రెండో పెళ్లి అనేది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. ప్రజలు పక్కనున్న వాళ్ళని నిందించడం మానేసి. కలిసి బ్రతకడం అలవాటు చేసుకోవాలి.” అని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు ఆయన మొదటి భార్య రాజోషి కూడా ఆయన వివాహం పై సానుకూల స్పందన వ్యక్తం చేసారు.
“ఇన్నాళ్లు శకుంతల కూతురుగా, ఆశిష్ కి భార్యగా సమాజంలో గౌరవం పొందాను ఇప్పుడు.ఇప్పుడు స్వతంత్రంగా ఎదగాలనుకున్నాను మేమిద్దరం నడిచే మార్గాలు వేరు కావడంతో ఒకరిపై ఒకరికి ఎలాంటి కోపం లేకపోయినా, గొడవలు లేకపోయినా కలిసి ఉండలేము అని అర్థం చేసుకొని సగౌరవం గా విడిపోయాం. 22 ఏళ్ల పాటు కలిసి జీవించాం ఒకరంటే ఒకరికి మంచి గౌరవం మర్యాద ఉన్నాయి. అతడు మరో వివాహం చేసుకోవడానికి నా పూర్తి సమ్మతం ఉంటుంది. నా కొడుకు అర్థ్ కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకుంటాడు. ఆయన వివాహానికి నా శుభాకాంక్షలు..” అంటూ రాజోషి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
ఆశిష్ విద్యార్థి సుమారు మూడున్నర దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, ఒడియా, బెంగాలీ భాషల్లో నటించాడు. ఇప్పటి వరకూ 11 భాషల్లో 300కుపైగా సినిమాల్లో నటించడం విశేషం. 1995లో ద్రోహ్‌కాల్ సినిమాకుగాను అతడు నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. తెలుగులో గుడుంబా శంకర్, ఆగడు, పోకిరిలాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు.
End of Article