Ads
- చిత్రం : అశోకవనంలో అర్జున కళ్యాణం
- నటీనటులు : విశ్వక్ సేన్, గోపరాజు రమణ, రుక్సర్ ధిల్లాన్, రితిక నాయక్, రాజ్ కుమార్..
- నిర్మాత : సుధీర్ ఈధర మరియు బాపినీడు
- దర్శకత్వం : చింత విద్యాసాగర్
- సంగీతం: జై క్రిష్
- విడుదల : మే 6,2022
స్టోరీ :
Video Advertisement
ఈసినిమా కులాంతర వివాహం మీద నడుస్తుంది. తెలంగాణలోని సూర్యాపేట్ కి చెందిన అర్జున్ కుమార్ అల్లం (విశ్వక్ సేన్) అనే 33 సంవత్సరాల యువకుడికి అమ్మాయిలు దొరకడం కష్టం అవుతుంది. తన కులంలో అమ్మాయిలు ఎవరు దొరకరు. దాంతో పసుపులేటి మాధవి (రుక్సార్ థిల్లాన్) అనే గోదావరికి చెందిన వేరే కులం అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి నిర్ణయించుకుంటాడు అర్జున్ కుమార్. అర్జున్ మాధవి ఇష్టపడతారు కానీ మాధవి అర్జున్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. మాధవి ఎందుకు నిరాకరించింది? అప్పుడు అర్జున్ ఏం చేశాడు? తర్వాత ఏమయ్యింది? చివరికి వారిద్దరూ కలిసారా లేదా? ఇదంతా తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.
రివ్యూ :
ఈ సినిమాలో విశ్వక్ సేన్ ను సరికొత్తగా చూపించారు. గత సినిమాల్లో లాగా కాకుండా ఇందులో పూర్తి గేటప్ చేంజ్ అయిపోయింది. విశ్వక్ సేన్ చేసింది తక్కువ సినిమాలే అయినా, చాలా స్పీడ్ గా పేరు సంపాదించారు. అతనికి బాగా పేరు తెచ్చిన సినిమా ఫలక్నామాదాస్ అని చెప్పవచ్చు. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో విశ్వక్ సేన్ చాలా వైవిధ్యమైనటువంటి పాత్రలో కనిపించాడు.. చాలా క్లాస్ పాత్రలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఏది ఏమైనా అశోకవనంలో అర్జున కళ్యాణం ఎన్నో వివాదాల మధ్య భారీ అంచనాలతో విడుదలైంది. సినిమా అదిరిపోయింది అంటూ చాలామంది ప్రేక్షకులు అంటున్నారు.
ఇప్పటికే భారీ బుకింగ్స్ తో అదరగొడుతున్నారు. టికెట్లు కూడా అన్ని అమ్ముడుపోయారని హౌస్ ఫుల్ అవుతున్నాయి అంటూ ట్వీట్ లు పెడుతున్నారు. కొన్ని చోట్ల మాత్రం సరైన థియేటర్లను కూడా ఇవ్వలేదని అభిమానులు అడుగుతున్నారు. ఈ సినిమాలో అమాయకుడిగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు విశ్వక్ సేన్. ఎంతో వినోదాత్మకంగా సాగే సినిమా కడుపుబ్బ నవ్విస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ప్లస్ పాయింట్స్:
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- హీరో హీరోయిన్ కెమిస్ట్రీ
- కొన్ని కామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్ :
- ల్యాగ్ అయిన సెకండ్ హాఫ్
- కాస్త స్లోగా ఉన్న స్క్రీన్ ప్లే
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
ముఖ్యంగా ఈ సినిమాను 30 సంవత్సరాలు ఉన్నా వివాహం కావడం లేదని బాధపడుతున్నవారు తప్పకుండా చూడాల్సిందే. ఇందులో విశ్వక్ సేన్ చాలా బాగా నటించారు. అమాయక పాత్రలో అయినా చేసిన నటన అందరికీ ఆకట్టుకుంటోంది. అక్కడక్కడా కొంచెం స్లోగా ఉన్నా కూడా సినిమా ఒకసారి చూడాల్సిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది.
End of Article