“ఇలా చేస్తే సహించేది లేదు..!” అంటూ… “అషు రెడ్డి” పోస్ట్..! ఏం అన్నారంటే..?

“ఇలా చేస్తే సహించేది లేదు..!” అంటూ… “అషు రెడ్డి” పోస్ట్..! ఏం అన్నారంటే..?

by Mohana Priya

Ads

ప్రస్తుతం టాలీవుడ్ లో మళ్లీ  ఒక వివాదంకి సంబంధించిన కేస్ సంచలనం రేపుతోంది. ప్రముఖ నిర్మాత కేపీ చౌదరి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. విచారణలో ఇంకా ఎంతో మంది సెలబ్రిటీల పేర్లు బయటికి వస్తున్నాయి. వారిలో టాలీవుడ్ కి చెందిన ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు.

Video Advertisement

ఈ విషయంపై ఇంకా చర్చ కొనసాగుతోంది. కేపీ చౌదరితో పాటు కొంత మంది సెలబ్రిటీలు ఉన్న ఫోటోలు బయటికి వచ్చాయి. దాంతో వారందరిపై కూడా సందేహం నెలకొంది. ఈ క్రమంలో బిగ్ బాస్ తో ఫేమస్ అయిన అషు రెడ్డిపై కూడా చాలా వార్తలు వస్తున్నాయి.

ఈ విషయంలో అషు రెడ్డి కూడా ఉన్నారు అని అంటున్నారు. ఈ విషయంపై చర్చ జరుగుతోంది. దాంతో అషు రెడ్డి ఈ విషయంపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా అషు రెడ్డి ఈ విషయం గురించి మాట్లాడారు. తన పోస్ట్ లో అషు రెడ్డి ఈ విధంగా చెప్పారు “ఇది ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి మాత్రమే చెప్తున్నాను. మీడియాలో కొంతమంది నాతో కొంత మందికి సంబంధం ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.”

ashu reddy responds on kp chowdary issue

“అందుకే ఈ విషయంపై ఆ మాట్లాడే వారికి సమాధానం చెప్తున్నాను. నా నంబర్ ని అంత ఓపెన్ గా పోస్ట్ చేస్తే మాత్రం ఈ సారి సహించేది లేదు” అని అర్థం వచ్చేలాగా అషు రెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈ విషయంపై వస్తున్న వార్తల్లో, కేపీ చౌదరికి చెందిన వాట్సాప్ చాట్ కూడా చూపిస్తున్నారు.

ఇందులో కొన్ని చోట్ల అషు రెడ్డి నంబర్ కనిపించడంతో ఇవాళ మాట్లాడి ఇలాంటివి చేస్తే సహించేది లేదు అని అన్నారు. ఇంకా ఎంతో మంది ప్రముఖుల పేర్లు కూడా ఇందులో బయటికి వస్తున్నాయి. అందులో మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలా మంది నటులు ఉన్నారు. కేపీ చౌదరి నిర్మాత కావడంతో ఎంతోమంది సినీ ప్రముఖులతో స్నేహం ఉంది. ప్రస్తుతం అయితే విచారణ ఇంకా కొనసాగుతోంది.

ALSO READ : “బిగ్‌బాస్” తెలుగు-7 ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే..! ఎవరెవరు ఉన్నారు అంటే..?


End of Article

You may also like