అంబానీ తరువాత స్థానంలో ‘అదానీ’ చైనా పారిశ్రామికవేత్త జోంగ్ షాన్షాన్ కి మూడవ స్థానం !

అంబానీ తరువాత స్థానంలో ‘అదానీ’ చైనా పారిశ్రామికవేత్త జోంగ్ షాన్షాన్ కి మూడవ స్థానం !

by Anudeep

Ads

బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్ టైమ్ ఇండెక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆసియా లో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ రెండవ స్థానం సంపాదించుకున్నారు.మొత్తం ఆసియా ఖండం లోనే శ్రీమంతుల జాబితాలో రెండవ స్థానం లో కోన సాగుతుండగా రిలయన్స్ అధినేత అంబానీ మొదటి స్థానం లో కొనసాగుతున్నారు.

Video Advertisement

asia-second-ricchest-person-adani

asia-second-ricchest-person-adani

ఆసియా లోని శ్రీమంతుల రెండవ స్థానం లో ఉన్న చైనా పారిశ్రామికవేత్త జోంగ్ షాన్షాన్ ను వెనక్కి నెట్టి రెండవ స్థానం కైవసం చేసుకున్నారు ‘అదానీ’.అదానీ ప్రస్తుత సంపదను 6,650 కోట్ల డాలర్లు (రూ. 4.86 లక్షల కోట్లు)గా అంచనా వేశారు.బ్లూంబర్గ్ బిలియనీర్స్ రియల్ టైమ్ ఇండెక్స్ అంబానీ ఆస్తి 7,650 కోట్ల డాలర్లుగా కాగా మన కరెన్సీ తో పోల్చుకుంటే దాని విలువ రూ. 5.58 లక్షల కోట్లు.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 3,270 కోట్ల డాలర్లు పెరిగింది.ప్రపంచ కుబేరుల్లో అంబానీ 13 అదానీ 14 స్థానం లో కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి : బాంబే హైకోర్టు కనీ వినీ ఎరుగని రీతిలో ! భోజన విరామం కూడా లేకుండా..


End of Article

You may also like