చిన్నతనంలోనే కుటుంబాన్ని పోషించే తండ్రి కన్నుమూయడంతో పిల్లలను పెంచడం కోసం వంట మనిషిగా మారిన తల్లిని చూస్తూ పెరిగిన ఒక యువకుడు. తల్లి పడిన కష్టంతో చదివి సివిల్స్‌లో ర్యాంకును తెచ్చుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మందికి కష్టం అనే మాటకి అర్థం తెలియదని చెప్పవచ్చు.

Video Advertisement

తల్లిదండ్రులు అన్ని సమకూరుస్తున్నా, ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నా, చిన్న చిన్న వాటికే బాధ పడుతున్నారు. కొందరు అయితే వాటికి భయపడి జీవితానికి అర్ధాంతరంగా ముగిస్తున్నారు. కానీ ఒక యువకుడి మాత్రం చిన్నతనం నుండి ఎన్నో కష్టాలు పడుతూ అనుకున్నది సాధించాడు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆసిఫాబాద్ జిల్లాలోని  రిబ్బెన మండలంలోని తుంగెడకు చెందిన మనోహర్, విస్తారిల కుమారుడు డోంగ్రి రేవయ్య. అతని తండ్రి కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. తల్లి విస్తారి గవర్నమెంట్ స్కూల్ లో వంట మనిషిగా పని చేస్తుంది. ఇక రేవయ్య చదువు చిన్నతనం నుండి గవర్నమెంట్ స్కూల్ లోనే కొనసాగింది. కాగజ్ నగర్‌ శిశుమందిర్‌లో 5వ తరగతి వరకు, ఆ తరువాత టెన్త్ క్లాస్ వరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం లో చదువుకున్నాడు. ఆ తర్వాత రేవయ్య హైదరాబాద్‌ సాంఘిక సంక్షేమ కాలేజ్ లో ఇంటర్ చేశాడు.
మద్రాస్‌ ఐఐటీ కాలేజ్ లో బీటెక్‌ చేసి, ప్రైవేట్‌ కంపెనీలో జాబ్ సాధించాడు. అయితే రేవయ్యకు ఆ జాబ్ లో సంతృప్తి కలగలేదు. దాంతో జాబ్ చేస్తూ, సివిల్స్ కోసం ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. జాబ్ వల్ల సరిగా ప్రిపేరు అవట్లేదని రేవయ్య జాబ్ ను వదిలి పూర్తిగా ప్రిపరేషన్‌ పై పోకస్ చేశాడు. అందుకు తల్లి కూడా మద్దతు తెలిపి, ఫ్యామిలీ పోషణ అంతా విస్తారి చూసుకుంది.
తాను ఉద్యోగం మానేయడం వల్ల తల్లి పని చేస్తూ, కష్టపడటం చూసి బాధ కలిగినా, తన లక్ష్యం కోసం బాగా చదివి, తాను అనుకున్న లక్ష్యాన్ని సాదించాడు. తాజాగా రిలీజ్ అయిన యూపీఎస్సీ రిజల్ట్స్ లో రేవయ్యకు 410వ ర్యాంక్ వచ్చింది. ఆలిండియా ర్యాంక్ సాదించిన రేవయ్యను ప్రశంసిస్తున్నారు.

Also Read: ఈ ఫోటో వెనుక ఉన్న కథ ఎంటో తెలిస్తే… హ్యాట్సాఫ్ అనాల్సిందే..!