ఈ ఫోటో వెనుక ఉన్న కథ ఎంటో తెలిస్తే… హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

ఈ ఫోటో వెనుక ఉన్న కథ ఎంటో తెలిస్తే… హ్యాట్సాఫ్ అనాల్సిందే..!

by kavitha

Ads

అన్న భార్యను తల్లితో సమానమని సాధారణంగా పెద్దలు అంటుంటారు. దానికి కారణం తల్లి తర్వాత వదిన తల్లిలా ఇంట్లోవారిని మరియు ఇంటి బాధ్యతలను చూసుకుంటుంది. అందువల్లే తల్లికి ఇచ్చిన గౌరవమే వదినకు ఇస్తుంటారు. ఈ విషయం అందరికి తెలిసిందే.

Video Advertisement

అయితే ఈ మధ్య కాలంలో చాలామంది వదిన వరుస అయ్యే స్త్రీలతో కూడా నీచంగా ప్రవర్తించిన సంఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి తన వదిన మరియు అన్న పిల్లల కోసం చేసిన పనికి నెటిజెన్లు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తన వదిన విషయంలో ఒక మరిది చేసిన పని అందరిని షాక్ అయ్యేలా చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో కొంత మంది నెటిజెన్లు అతనిపై ప్రశంసలను కురిపిస్తూ ఉన్నారు. అయితే ఆ మరిది ఏం చేశాడంటే అతను తన అన్న భార్యను వివాహం చేసుకున్నాడు. షాక్ అయ్యారా? అదేంటి వదినను పెళ్లి చేసుకోవడం తప్పు. అతన్ని మెచ్చుకోవడం ఎందుకు అనుకుంటున్నారు కదా. ముగ్గురు పిల్లలు ఉన్న ఆ మహిళ భర్త మరణించడంతో పిల్లల బాధ్యత చూసుకుంటూ ఒంటరిగా బ్రతుకుతోంది. అయితే ముగ్గురు పిల్లల బాధ్యతలను తీసుకోవాలని మారిది అనుకున్నాడు ఈ క్రమంలోనే తన అన్న భార్యను వివాహం చేసుకున్నాడు. శంబాజీ అనే వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. శంబాజీకి భార్య, ఎనిమిది నెలల కొడుకు, ఇద్దరు కవలల ఉన్నారు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న వదినను, అన్న పిల్లలను చూసి బాధపడిన  శంబాజీ తమ్ముడు రాహుల్ వినోద్ ఒంటరిగా బ్రతుకుతున్న వదినకు తోడు ఉండడానికి, తన అన్న పిల్లల బాధ్యతలను తీసుకోవడానికి అన్న భార్యను పెళ్లి చేసుకున్నాడు. అందువల్లనే అతని పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: పుట్టగానే తండ్రి వదిలేశాడు… కానీ నేడు తల్లిదండ్రులని గర్వపడేలా చేశారు..! వీరి కథ తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!


End of Article

You may also like