Ads
పెళ్లి అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. అయితే చాలా మంది ఈ విషయంలో తొందరపడతారు. ఎవరో చెప్పిన మాటలు విని, లేదా సొంత నిర్ణయం తీసుకునే వీలు లేక ఒక్కొక్కసారి వారికి సెట్ అవ్వని వ్యక్తిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. దాంతో పెళ్లయిన తర్వాత సమస్యలు తలెత్తుతాయి. అలా పెళ్లయిన తర్వాత సమస్యలు రాకుండా ఉండాలి అంటే మీరు పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ని ఈ ప్రశ్నలు అడగండి.
Video Advertisement
# అసలు ఆ వ్యక్తికి పెళ్లి చేసుకోవడం ఇష్టమా, కాదా అనే విషయం ముందుగా తెలుసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కుటుంబ ప్రోద్బలం తో గాని లేదా వేరే ఏదైనా సమస్య వల్ల కానీ వాళ్లకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలను ముందే అడిగి నిర్ణయం తీసుకోండి.
# అసలు పెళ్లి అంటే వాళ్ల దృష్టిలో ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకోండి.
# పెళ్లి తర్వాత ఎక్కువగా మారేది ఒక ఆడపిల్ల జీవితం. పెళ్లయిన తర్వాత ఎంతో మంది మహిళలు వారి ఉద్యోగాలను విడిచి పెడుతున్నారు అని సర్వేలో వెల్లడి అవుతున్నాయి. అందుకు ముఖ్య కారణం తన అత్తమామల నుండి ఎదురవుతున్న ఒత్తిడి. కాబట్టి పెళ్ళికి ముందు మీ జీవిత లక్ష్యం గురించి స్పష్టంగా చెప్పండి. ఒకవేళ పెళ్లయిన తర్వాత మీ లక్ష్యాన్ని మీరు చేరుకోలేరు అనుకుంటే ఆ పెళ్లి గురించి మాటల దగ్గరే ఆపేయండి.
# బంధాలకి, కుటుంబానికి ఎంత విలువ ఇస్తారో కూడా వారి మాటల ద్వారా మీరు గ్రహించడానికి ప్రయత్నించండి.
# పెళ్ళికానుకల గురించి అడిగి తెలుసుకోండి. ఒకవేళ కట్నం లాంటివి కావాలంటే వెంటనే తిరస్కరించడం మంచిది. ఎందుకంటే ఈ కట్నకానుకల విషయం గురించి పెళ్లయిన తర్వాత కూడా చాలా సమస్యలు వస్తున్నాయి.
# మీ తల్లిదండ్రుల గురించి, మీ భాగస్వామి తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించాలి. పెళ్లయిన తర్వాత వారి జీవితం కూడా సజావుగా సాగడానికి మీరే చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలి.
# ఇంటి బాధ్యతల గురించి కూడా మాట్లాడుకొని ముందుగానే ఒక నిర్ణయానికి రండి.
# ఒక వ్యక్తి తనకి తెలియకుండానే ఆరోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. అలాంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయేమో అడిగి తెలుసుకోండి.
# గతంలో రిలేషన్ షిప్ లో ఉండటం లేదా బ్రేక్ అవ్వడం వంటివి ఏమైనా ఉంటే మీరు వారికి చెప్పేయాలి. అలాగే వారికి ఏమైనా ఉన్నా కూడా మీరు అడిగి తెలుసుకోవాలి.
# పిల్లల విషయంలో కూడా మీరు ఇద్దరూ ఒక నిర్ణయానికి రావాలి. పిల్లలు కావాలా, వద్దా అనే విషయంపై చర్చించుకుని నిర్ణయం తీసుకుంటే పెళ్లయిన తర్వాత మీరిద్దరూ అదే నిర్ణయం మీద ఉండగలుగుతారు. అప్పుడు మీ జీవితం సజావుగా సాగుతుంది.
ఇలా చేయడం ద్వారా పెళ్లయిన తర్వాత వచ్చే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు.
source : https://www.facebook.com/284535215034346/posts/2130006500487199/?d=n
End of Article